నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(Heavy Rains) ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి నెల్లూరు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం (అక్టోబర్ 22) ఒక రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా(Himanshu Shukla) తెలిపారు.
Read Also: Chandrababu Naidu: కుప్పానికి ‘సుర్బానా‘చే మాస్టర్ ప్లాన్

వర్షాల పరిస్థితిపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, పోలీసు మరియు రెవెన్యూ విభాగాలు పూర్తి అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు కంట్రోల్ రూమ్ నంబర్లు 0861-2331261 మరియు 7995576699 ను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది.
నెల్లూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి గాంధీ బొమ్మ, సుబేదారు పేట, వీఆర్సీ సెంటర్, కెవిఆర్ పెట్రోల్ బంక్ సెంటర్, కొండాయపాలెం గేట్, వాహబ్పేట, శివ ప్రియ సెంటర్ వంటి కీలక ప్రాంతాల్లో రహదారులు నీటితో నిండిపోయాయి. రోడ్లపై మోకాలి లోతు వరకు నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నీటితో మురుగు నీరు కలిసి వీధుల్లో చేరడంతో ఆరోగ్య సమస్యల భయం నెలకొంది. సండే మార్కెట్ ప్రాంతంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన రోడ్డు పక్కన నిలిపిన వాహనాలు పడిపోయాయి. నగరంలోని పలు అండర్ బ్రిడ్జిల కింద వర్షపు నీరు చేరి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఏ వాతావరణ ప్రభావం వలన నెల్లూరులో వర్షాలు కురుస్తున్నాయి?
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.
నెల్లూరు జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన తేదీ ఏది?
బుధవారం, అక్టోబర్ 22 న సెలవు ప్రకటించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: