జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ నుంచి 40 స్టార్ ప్రచారకుల జాబితా
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఇప్పటికే తన ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ (Breaking news) తరఫున ఎన్నికల ప్రచారానికి పాల్గొననున్న 40 మంది స్టార్ ప్రచారకుల జాబితాను బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి అందించింది. ఈ జాబితాను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆమోదించింది.
ఈ జాబితాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులతో పాటు, పార్టీకి కీలకంగా పనిచేస్తున్న నాయకుల పేర్లు ఉన్నాయి. పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన వారందరికీ అధికారిక అనుమతి లభించడంతో ప్రచారం మరింత ఉత్సాహంగా సాగే అవకాశముంది
Read also: పోషకాలు అధికంగా వుండే ఈ పండు గురించి తెలుసుకుందాం ..

స్టార్ ప్రచారకుల జాబితాలో కేసీఆర్ పేరు..
అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జాబితాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ పేరు కూడా ఉంది. గత కొన్ని ఎన్నికల్లో కేసీఆర్(Breaking news)ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండగా, ఉప ఎన్నికలో మాత్రం ఆయన ప్రత్యక్షంగా ప్రచారానికి రావచ్చన్న సూచనలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఇది ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నిక కావడంతో, కేసీఆర్ హాజరైతే కార్యకర్తలకు మోరల్ బూస్ట్ కలగనుంది. పార్టీ నాయకత్వం ఆయనను ప్రచారానికి తీసుకురావడానికి సన్నద్ధమవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :