జపాన్(japan) రాజకీయ చరిత్రలో కొత్త మైలురాయి ఏర్పడింది. అక్టోబర్ 21, 2025న జపాన్ పార్లమెంట్ (డైట్) సనాయే తకైచిని(Sane Takaichi) మహిళా ప్రధానిగా ఎన్నుకుంది. 64 ఏళ్ల తకైచి, గతంలో దేశ ఆర్థిక భద్రతా మంత్రిగా సేవలందించారు. కన్జర్వేటివ్ నాయకురాలిగా, చైనా పట్ల కఠినమైన విధానంతో గుర్తింపు పొందిన తకైచి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధినేతగా ఎన్నికైన తరువాత, మైనారిటీలో ఉన్న తన పార్టీకి మిత్రపక్షం జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (JIP) మద్దతు ఇచ్చి ప్రధాని పదవికి అవకాశం కల్పించారు.
Read Also: H-1B Visa: అమెరికా H-1B వీసా ఫీజుపై సంచలన నిర్ణయం

Sane Takaichi: జపాన్‌కి తొలి మహిళా ప్రధాని – సనే టకైచి ఘన విజయంతకైచి నాయకత్వం, చైనా మరియు దక్షిణ కొరియాతో జపాన్ సంబంధాలను మరింత క్లిష్టతరం చేస్తుందనే అంతర్జాతీయ ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అదనంగా, మైనారిటీ ప్రభుత్వం నడిపించాల్సిన సవాళ్లతో పాటు, పెరుగుతున్న ధరలు, ఆర్థిక వృద్ధి మందగమనం వంటి సమస్యలను కూడా పరిష్కరించాల్సి ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో, ఆమెకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం, ఆసియా ప్రాంతీయ సదస్సులలో పాల్గొనడం వంటి కీలక బాధ్యతలు ఎదురవుతున్నాయి.
సనాయే తకైచి ఏనాటి నుంచి జపాన్ ప్రధాని అయ్యారు?
అక్టోబర్ 21, 2025న.
తకైచి ఏ పార్టీకి చెందుతున్నారు?
లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP).
ఆమెకు మద్దతుగా ఎవరు ఉన్నారు?
మైనారిటీలో మిత్రపక్షంగా జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (JIP) మద్దతు ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: