యువ హీరో ప్రదీప్ రంగనాథన్ మరియు అందమైన నటి మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, ఎమోషనల్ టచ్ కలిగిన స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి అదనపు బలం ఇచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ సినిమా థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సినిమా పై వచ్చిన పాజిటివ్ టాక్‌తో పాటు, సోషల్ మీడియాలో మంచి హైప్ ఏర్పడడంతో బాక్సాఫీస్ వద్ద డిమాండ్ పెరిగింది.
Telugu news: BC Bandh: బంద్‌లో హింసాత్మక ఘటనలు: 8 యువకులు అరెస్ట్
ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, ‘డ్యూడ్’ రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. మొదటి రోజే రూ.22 కోట్ల గ్రాస్‌తో స్ట్రాంగ్ స్టార్ట్ తీసుకున్న ఈ సినిమా, రెండో రోజు దానిని అధిగమించి రూ.23 కోట్ల వసూళ్లు రాబట్టింది. చిన్న హీరో సినిమాకి ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం విశేషమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటకల్లో కూడా మంచి రన్ కొనసాగుతోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లు, యువ ప్రేక్షకుల వద్ద ఈ సినిమా టాక్ అద్భుతంగా ఉంది.
విజయానికి ప్రధాన కారణం ప్రదీప్ రంగనాథన్ ఎనర్జీ, సహజమైన నటన, అలాగే మమితా బైజు చక్కని ప్రెజెన్స్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. సంగీతం, సినిమాటోగ్రఫీ, హాస్యభరిత డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్న బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలవడం, కొత్త తరహా కథలకీ ప్రేక్షకులు ప్రాధాన్యం ఇస్తున్నారని మరోసారి నిరూపించింది. వారం చివరలో కూడా ఇదే రీతిలో కొనసాగితే, “డ్యూడ్” 100 కోట్ల క్లబ్‌లో చేరడం కేవలం సమయ సమస్య మాత్రమే అని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/