గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తో ట్రంప్ భేటీ అయ్యారు. తోమహాక్ క్షిపణులు, ఇతర ఆయుధాల కోసం జెలెన్‌స్కీ అమెరికా చేరుకున్నారు. వైట్‌హౌస్ లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. క్యాబినెట్ రూమ్‌లో జరిగిన లంచ్ మీటింగ్‌కి జెలెన్‌స్కీ స్టైలిష్ షూట్ ధరించి వచ్చారు. ఆ సూట్ అధ్యక్షుడి దృష్టిని ఆకర్షించింది. ‘ఈ జాకెట్ నిజానికి చాలా స్టైలిష్‌గా ఉంది. ఇందులో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు’ అంటూ అధ్యక్షుడు కితాబిచ్చారు. అక్కడితో ఆగకుండా అవును, చాలా అందంగా.. అంటూనే ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
Read Also: US: ఇక అమెరికా మాకొద్దు… భారీగా తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్

అదేవిధంగా ఇరుదేశాలు వెంటనే యుద్ధం ముగించాలని ఈ సందర్భంగా ట్రంప్ పిలుపునిచ్చారు. జెలెన్‌స్కీతో సమావేశం చాలా ఆసక్తికరంగా, స్నేహపూర్వకంగా జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ గుర్తు చేశారు. ఇక దీన్ని ముగించి శాంతి నెలకొల్పాలని పుతిన్, జెలెన్‌స్కీని కోరినట్లు వెల్లడించారు. ‘ఇకపై కాల్పులు, మరణాలు, అనవసరమైన భారీ ఖర్చులు వద్దు. నేను అప్పుడే అధ్యక్షుడిగా వుండి ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేదే కాదు’ అని ట్రంప్ (Donald Trump)వ్యాఖ్యానించారు.
డోనాల్డ్ ట్రంప్ ప్రారంభ జీవితం – విద్య?
డోనాల్డు జాన్ ట్రంపు 1946 జూన్ 14న క్వీన్సు లోని న్యూయార్కు నగర బరోలోని జమైకా హాస్పిటలులో ఫ్రెడు ట్రంపు, మేరీ అన్నే మాక్లియోడు ట్రంపు దంపతులకు నాల్గవ సంతానం. ఆయన జర్మనీ, స్కాటిషు సంతతికి చెందినవాడు. ఆయన తన పెద్ద తోబుట్టువులు మేరియాను, ఫ్రెడు జూనియరు, ఎలిజబెతు ఆయన తమ్ముడు రాబర్టులతో కలిసి క్వీన్సులోని జమైకా ఎస్టేట్సు పరిసరాల్లోని ఒక భవనంలో పెరిగాడు. ఫ్రెడు ట్రంపు తన పిల్లలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి $20,000 చెల్లించారు. ఇది 2024లో సంవత్సరానికి $265,000కి సమానం. ట్రంపు ఎనిమిదేళ్ల వయసులో ద్రవ్యోల్బణం-సర్దుబాటు చేసిన డాలర్లలో లక్షాధికారి.
డోనాల్డ్ ట్రంప్ వ్యాపార రంగం?
ట్రంపు ప్రపంచ కుబేరుల్లో స్థానం సంపాదించినా ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కాదా అనే అంశం కూడా వివాదాస్పదంగానే ఉంది. 1985 నుంచి 2016 వరకు అమెరికా స్టాకు మార్కెట్టును, న్యూయార్కులో ఆస్తి విలువలను పోల్చుకుంటే ట్రంపు ఎదుగుదల సగటు స్థాయిలోనే ఉందని 2016లో ది ఎకనమిస్టు అనే పత్రిక పేర్కొంది. వ్యాపార విజయాల వంటి మెరుపులతో పాటు బ్యాంకులకు అప్పుల ఎగవేతలు వంటి మరకలు కూడా ఉన్నాయని ఆ పత్రిక పేర్కొంది. వ్యాపార, నైతిక అపజయాలతోపాటు రియలు ఎస్టేటు విజయాలు కలిస్తే ట్రంపు అని ఆయన ప్రత్యర్థులు అంటుంటారు. ట్రంపు తొలుత కుటుంబ సంస్థ అయిన ఎలిజబెతు అండ్ సన్సులో రియలు ఎస్టేటు వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆయన తొలి ప్రాజెక్టును తండ్రితో కలిసి పూర్తి చేశారు. 1971లో ఆయన వ్యాపార పగ్గాలను స్వీకరించగానే సంస్థ పేరును ది ట్రంపు ఆర్గనైజేషనుగా మార్చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper :epaper.vaartha.com/
Read Also: