ధంతేరస్ సందడికి శుభారంభం
దీపావళి(Diwali) వేడుకలకు మంగళకరమైన ఆరంభం ధంతేరస్. దీపావళి(Dhanteras) ముందు రోజు నుంచి ఇంటి శుభ్రత, అలంకరణలు, ప్రత్యేక వంటలు మొదలవుతాయి. ఈ రోజు భగవాన్ ధన్వంతరి జయంతి కూడా కావడం విశేషం. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను కొనడం వల్ల సంవత్సరం పొడవునా ఇంట్లో ధనం, ఆరోగ్యం, శ్రేయస్సు నిలుస్తుందని పూర్వీకుల నమ్మకం. మతాచారాలు, వాస్తు సిద్ధాంతాల ప్రకారం కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం ఎంతో శుభకరం.
Read also: ఇది మాకెంతో గర్వం భార్య మంత్రి పదవి పై హర్షం

ధంతేరస్ రోజున కొనలసిన 8 శుభవస్తువులు
ఇత్తడి లేదా రాగి పాత్రలు
ధన్వంతరి దేవునికి అంకితం చేసినవిగా వీటిని పరిగణిస్తారు. ఇంటికి ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు తేవడంలో (Dhanteras) ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
చీపురు
పేదరికాన్ని పారద్రోలే చిహ్నంగా చీపురును పరిగణిస్తారు. కొత్త చీపురును ఇంటికి తీసుకురావడం వలన దోషాలు తొలగి శుభత కలుగుతుంది.
గోమతి చక్రం
లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వస్తువుగా భావించే గోమతి చక్రం సంపదను ఆకర్షించడంలో సహాయపడుతుంది.
ధనియాలు
వీటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం సంపదను, శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.
వెండి వస్తువులు
వెండిని ధనం, వైభవానికి సంకేతంగా భావిస్తారు. ఇది ఇంటికి శ్రేయస్సును తీసుకొస్తుంది.
లక్ష్మీ-గణేశ విగ్రహాలు
దీపావళి పూజలో ప్రధానంగా ఉండే విగ్రహాలు. ఇంటికి శాంతి, ఆనందం, ఐశ్వర్యాన్ని తెచ్చే ప్రతీకలు.
మట్టి ప్రమిదలు
ఇవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచి, దుష్శక్తులను తొలగిస్తాయని నమ్మకం.
పాలు-పంచదార
పూజలో నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితుల అభిప్రాయం.
ఈ వస్తువులను ధంతేరస్ రోజున ఇంటికి తీసుకురావడం వలన సంవత్సరం పొడవునా శుభత, ఆరోగ్యం, ధనం, సంతోషం నిలుస్తాయని నమ్మకం. ఇది పాజిటివ్ శక్తిని ఆహ్వానించేందుకు ఒక చిహ్నంగా పరిగణించబడుతుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: