హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో నియంత పాలన ఉండదని, పూర్తి స్వాతంత్ర్యం ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) అన్నారు. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వ్యవహారం కేవలం ‘టీ కప్పులో తుఫాన్’ లాంటిదని, ఈ చిన్న సమస్యలు సర్దుమణిగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో విలేకరులతో శుక్రవారం మాట్లాడిన ఆయన, కొండా సురేఖ అంశంపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ చర్చిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో అప్పుడప్పుడు సమస్యలు రావడం సహజమని తెలిపారు.
Read also: BJP MLA: జిమ్‌లకు హిందూ అమ్మాయిలు వెళ్లొద్దని ఎమ్మెల్యే వ్యాఖ్యలు

బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలో జనగణనలో, కులగణన జరగాలని కోరారని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ డెడికేషన్ కమిషన్ పెట్టి శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసిందన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ (SLP) వేశామని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని, రేపటి (అక్టోబర్ 18) బీసీ బంద్‌కు సంపూర్ణంగా మద్దతిస్తుందని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.
బీజేపీపై ఒత్తిడికి సూచన
బీసీ రిజర్వేషన్లపై(BC Reservations) ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్‌లు అన్ని రాజకీయ పార్టీలతో మద్దతు కోరారని ఆయన తెలిపారు. బీజేపీ నాయకులు రామచంద్రరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ఢిల్లీకి తీసుకువచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో చర్చించాలని ఆయన సూచించారు. తాము కూడా మద్దతు ఇస్తామని, అవసరమైతే వారితో కలిసి ప్రధాని, రాష్ట్రపతిని కలుస్తామని చామల అన్నారు. బీసీలకు న్యాయం చేసి బీజేపీ క్రెడిట్ తీసుకున్నా తమకు నష్టం లేదని, తాము ఇప్పటికే కేబినెట్‌లో ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపించామని స్పష్టం చేశారు. రేపటి బీసీ బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కొండా సురేఖ అంశాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎలా అభివర్ణించారు?
ఈ సమస్య టీ కప్పులో తుఫాను లాంటిదని ఆయన అభివర్ణించారు.
బీసీ బంద్‌కు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తోంది?
బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి ఈ బంద్‌కు మద్దతు ఇస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: