ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి భారీ పెట్టుబడికి కేంద్రబిందువుగా మారింది. విశాఖపట్నం (Visakhapatnam) లో ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం కె. రహేజా కార్పొరేషన్ (K. Raheja Corporation) భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం కలిగి ఉంది. ఇప్పుడు ఆ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీర ప్రాంతం — విశాఖ(Visakhapatnam) లో ప్రదర్శించనుంది.
Read Also: Law : చట్టం అందరికి సమానమేనా?

కె. రహేజా సంస్థ ఐటీ కంపెనీలకు అవసరమైన వాణిజ్య (commercial) మరియు నివాస (residential) భవనాలను నిర్మించేందుకు రూ.2,172.26 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. దీనికోసం ప్రభుత్వం విశాఖ మధురవాడ ఐటీ (IT) హిల్ నంబర్-3లో 27.10 ఎకరాల భూమి కేటాయించాలని కోరింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు అయితే, దాదాపు 9,681 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: