हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News: Rain: ఎపిలో ఒక్కసారిగా మారిన వాతావరణం

Sushmitha
Telugu News: Rain: ఎపిలో ఒక్కసారిగా మారిన వాతావరణం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాతావరణం(weather) ఒక్కసారిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీ సహా పొరుగు రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పు ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read Also: TG Weather: నైరుతి రుతుపవనాల ప్రభావం.. మూడు రోజులు వర్షాలు

Rain

దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వానలు

తమిళనాడు తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోతోందని అధికారులు తెలిపారు. రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది.

యానాం, కోస్తా తీరంలో హెచ్చరికలు

దక్షిణ భారతదేశం, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో తూర్పు, ఈశాన్య గాలులు ప్రారంభమవడంతో, ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల వర్షపాతం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు,(Moderate rains) ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లోకి ఏ రుతుపవనాలు ప్రవేశించాయి?

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి.

ఏఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది?

ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870