విజయవాడ : కవుల కామధేనువు, తెలుగునాట మిని కవిత ఉద్యమ రథసారధుల్లో ఒకరు “ఎక్స్ రే” కొల్లూరి(72) ఇక లేరు. ఆయన విజయవాడలో ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో హృద్రోగ సమస్య తలెత్తడంతో అక్షర ఐక్యమయ్యారు. తెలుగునాట (Writer kolluri) యువతరం కవుల నుంచి లబ్దప్రతిష్టుల వరకు కొల్లూరి అంటే అందునా “ఎక్స్రే ” కొల్లూరి అంటే తెలియని వారు లేరు. ఆయనది వ్యవస్థపై ధిక్కాస్వరం, వ్యవస్థలో లోలోతుల నిగ్గుదిశలో “ఎక్స్ రే” పత్రికను స్థాపించి కేవలం అర్ధ రూపాయికే అందించిన కవుల వేదిక అతను. ఆయన ఎక్స్రే పత్రిక ద్వారా సాహిత్య సేవ చేయడంతో పాటు ఎందరో ప్రతిభావంతులైన కవులకు, విమర్శలకు ఏటా అవార్డులు ఇచ్చి సత్కరించారు. చలనచిత్రంతోను ప్రవేశం ఉన్న కొల్లూరు మెగాస్టార్ చిరంజీవి పేరు టైటిల్గా గా ప్రతికకు సంపాదకత్వం వహించారు. ఎక్స్రే అవార్డు అంటే జాతీయ స్థాయిలో అదో అత్యంత గౌరవనీయ పురస్కారంగా ఇప్పటికి కవులు భావిస్తారు. లయన్స్ క్లబ్బు ద్వారా సామాజిక సేవలు, వాకర్స్ అసోషియేషన్ ద్వారా ఎన్నో దానాలు, వేసవి వచ్చిందంటే మూడు నెలల నిరంతరాయ మజ్జిగ పంపిణీ, కొల్లూరి తెలుగు సాహిత్యానికి అందించిన కవులు, కళాకారులు. స్వచ్చంద సేవకులు లేక్కలేనంత మంది. ఏ అంశంపైనైనా వినేవారికి విసుగు రాకుండా అనర్ఘళంగా మాట్లాడే కొల్లూరి ఏ నాడు పొగడ్తలను, తెగడ్తలను ఒకే విధంగా తీసుకునే వారు. కృష్ణ, నారాయణమూర్తి, రావు బాలసరస్వతి, కృష్ణరాజు చెప్పుకుంటే పోతే ఆయన చేత అవార్డు అందుకోని వారు లేరు.
Read also: 78 యంగ్ ఇండియా గురుకులాలు.. ఆమోదం తెలిపిన కేబినెట్

సాహితీ, రాజకీయ, కళా రంగాల నుంచి ప్రగాఢ సంతాపం
ఇలా ఆయనకు(Writer kolluri) ఏపీ ప్రభుత్వం అనేక పర్యాయాలు ఉగాది పురస్కారాలు ప్రకటించిన తిరస్కరించారు. గత ఉగాదికి మిత్రులందరి బలవంతంపై ఉగాది పురస్కారం స్వీకరించారు. కొల్లూరు రచనలు సామాజిక చైతన్య గీతికలు, ఆయన రాసిన దీర్ఘకావ్యం పెనుసంచలనం. కొల్లూరి ఆకస్మికక మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు,(Chandrababu Naidu) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు మండలి బుద్దప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా, మెగాస్టార్ చిరంజీవి, ఎంఎల్సీ నాగబాబు, మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్, మల్లెతీగ కలిమిశ్రీ, ప్రజాసాహితీ గౌరవ సంపాదకులు, విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ నేత పెనుగొండ లక్ష్మీనారాయణ, గోరేటి వెంకన్న, ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షుడు శరత్చంద్ర(విల్సన్రావు), తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ సంచాలకు డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, శమంతక మణి, మందరపు హైమావతి కవులు కళాకారులు, సామాజిక సేవకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: