తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Govt) విద్య రంగంలో చరిత్రాత్మక మార్పులకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన, సమాన అవకాశాలున్న విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపడుతోంది.
ముఖ్యంగా పల్లె, పట్టణ తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలో విద్య నాణ్యతను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో “యంగ్ ఇండియా గురుకులాలు” (Young India Gurukuls) అనే కొత్త ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: TG Weather: నైరుతి రుతుపవనాల ప్రభావం.. మూడు రోజులు వర్షాలు
తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కేబినెట్ (TG Cabinet) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 78 యంగ్ ఇండియా గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఒక్కో గురుకుల కాంప్లెక్స్ (Gurukula Complex) నిర్మాణానికి రూ.200 కోట్లు చొప్పున, మొత్తం రూ.15,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ గురుకులాలు ఆధునిక సాంకేతిక వసతులతో, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రూపొందించబడతాయి.

సమగ్రంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు
విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, కళలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఆర్థికశాఖ ఇప్పటికే యంగ్ ఇండియా గురకుల కాంప్లెక్స్
నిర్మాణాలకు అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ఈ ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం (Deputy CM Mallu Bhatti Vikramarka) ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించారు. గురువారం నాటి కేబినెట్ భేటీ(TG Cabinet)లో దీన్ని ఆమోదించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: