हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Lokesh: అభివృద్ధి దిశగా భారత్ ను తీసుకెళ్తున్న మోదీ

Sushmitha
Telugu News: Lokesh: అభివృద్ధి దిశగా భారత్ ను తీసుకెళ్తున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) గురువారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనతో శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న నాలుగో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఈ ఆలయాన్ని సందర్శించారు.

Read Also: ISRO-SHAR: ఇస్రోలో 141 పోస్టుల భర్తీ

Lokesh

ఆలయ దర్శనం, శివాజీ స్ఫూర్తి కేంద్రం

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న ప్రధానికి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రధాని వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం యొక్క విశిష్టతను అర్చకులు ప్రధానికి వివరించారు. ఆలయ దర్శనం తర్వాత ప్రధాని మోదీ శ్రీశైలంలో ఉన్న శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ క్షేత్రాన్ని సందర్శించిన దానికి గుర్తుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి ధ్యాన మందిరం, శివాజీ విగ్రహాన్ని ప్రధాని పరిశీలించారు. కేంద్రం నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని, స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందంటూ ట్రస్టు నిర్వాహకులను అభినందించారు.

కర్నూలులో ప్రధానికి స్వాగతం, అభివృద్ధి కార్యక్రమాలు

అంతకుముందు కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో పరిశ్రమలు, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, రక్షణ, పెట్రోలియం వంటి పలు రంగాలకు చెందిన సుమారు ₹13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ సంస్కరణలపై జరిగే బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు.

లోకేశ్‌తో ప్రధాని ముచ్చట్లు, ప్రశంసలు

ప్రధాని మోదీ ఓర్వకల్లు విమానాశ్రయంలో మంత్రి నారా లోకేశ్‌తో సరదాగా ముచ్చటించారు. “గతసారి చూసినప్పటికంటే ఇప్పుడు చాలా బరువు తగ్గావు. త్వరలోనే మీ నాన్నలా తయారవుతావు” అని మోదీ వ్యాఖ్యానించారు. అనంతరం ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో లోకేశ్ మాట్లాడుతూ, భారత్‌ను తిరుగులేని శక్తిగా ప్రధాని మోదీ మారుస్తున్నారని, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే అన్నారు. గుజరాత్‌ సీఎంగా, దేశ ప్రధానిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీ, దేశాన్ని సూపర్‌ పవర్‌గా మారుస్తున్నారని ప్రశంసించారు. ఉగ్రదాడుల విషయంలో పాక్‌కు గట్టి బుద్ధి చెప్పారని, ‘ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు’ అన్నట్లుగా మోదీ స్టైల్ ఉంటుందని లోకేశ్ అన్నారు.

ప్రధాని మోదీ శ్రీశైలంలో ఏఏ దేవుళ్లను దర్శించుకున్నారు?

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.

ప్రధాని ప్రారంభించనున్న ప్రాజెక్టుల విలువ ఎంత?

సుమారు రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

https://vaartha.com/andhra-pradesh/isro-shar/565995/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

📢 For Advertisement Booking: 98481 12870