BJP: బిజెపి మద్దతు కోరిన ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) హైదరాబాద్ : బిసిలకు న్యాయం చేసేందుకు ఎంపి ఆర్. కృష్ణయ్య ఇచ్చిన పిలుపుకు బిజెపి పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బిసి జెఏసి నాయకులు బిజెపి కార్యాలయానికి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కుల సంఘాలు, బిసి సంఘాల ప్రతినిధులు కలిసి బిసిలకు న్యాయం చేయాలనే లక్ష్యం తో ఏర్పడిన ఈ జెఏసి, 18వ తేదీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బిసిల న్యాయం కోసం బిజెపి అండగా నిలుస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు తెలిపారు. బిసిలకు న్యాయం చేయాలనే డిమాండ్ జెఏసి చేపట్టిన ఉద్యమానికి మా పార్టీ మద్దతు ఉంటుందని, బిసిల హక్కుల కోసం ఆర్. కృష్ణయ్య సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని అన్నారు. బిసి సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా అభినందించారు. బిజెపి మాత్రమే బిసిలకు న్యాయం చేయగలిగిన పార్టీ అన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ డిక్లరేషన్ చేసి ఇప్పుడు ఆ పనిని ఇప్పుడు ఇతరులపై మోపుతుందన్నారు. ప్రజలు, బిసి సంఘాలు, ఓబిసి సమాజం ఈ విషయాన్ని గమనిస్తున్నారని అన్నారు.
Bihar Elections: ఫస్ట్ లిస్ట్ లో నితీష్ కు దక్కని చోటు

BJP: బిసి బంద్ కు బిజెపి మద్దతు: రాంచందర్రావు
బిసిలకు గౌరవం ఇచ్చిన పార్టీ బిజెపి (BJP) మాత్రమేనని అన్నారు. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో 27 మంది బిసి మంత్రులు ఉన్నారని అన్నారు. ఇది బిసిలకు పార్టీ ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనం అన్నారు. కులగణన – బిసిల చరిత్రాత్మక విజయం అన్నారు. 1931 తర్వాత మొదటిసారిగా కులగణన చేపట్టడం బిజెపి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఆగి పోయిన ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించి, బిసిల నిజమైన జనాభా ఆధారంగా విధానాలు రూపొందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, (Narendra modi) హోంమంత్రి అమిత్ షా ముందడుగు వేశారని అన్నారు. ఇది బిసి సమాజానికి చరిత్రాత్మక విజయం. కాంగ్రెస్ ద్రోహం బిసిల వ్యతిరేకతకు కారణం అన్నారు. బిసిల రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు, బిసిల వాదనలు వినకపోవడం పట్ల సమాజం ఆగ్రహంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులకు కారణం కాంగ్రెస్ పార్టీ చూపిన నిరక్ష ్యమే ఇందుకు కారణం అన్నారు. ఆర్. కృష్ణయ్య, ఇతర కుల సంఘాలు రిజర్వేషన్ల పిటిషన్లలో ఇంప్లీడ్ అయినా, వాటిని పట్టించుకోలేదన్నారు. ఈ ద్రోహ ధోరణే బిసి సమాజం కాంగ్రెసైపై తిరగబడేలా చేసిందన్నారు. బిజెపి మద్దతు బిసిల న్యాయ పోరాటానికి శక్తి అన్నారు. బిసి జెఏసి బంద్ పిలుపును బిజెపి సంపూర్ణంగా మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్రంలోని అందరు బిజెపి నాయకులు, కార్యకర్తలు బంద్ కార్యక్రమానికి చురుకుగా మద్దతు ఇవ్వాలని, పాల్గొనాలని పిలుపునిచ్చారు. బిసిలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు.
ఈ వార్తలో ముఖ్యాంశం ఏమిటి?
A1: బిసి (బిసిల) న్యాయానికి సంబంధించిన బంద్ పిలుపుకు బిజెపి పూర్తి మద్దతు ప్రకటించింది—బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, ఆర్. కృష్ణయ్య నాయకత్వంలోని బిసి జేఏసీ కార్యకర్తలను స్వాగతించారు.
Q2: ఎవరు మద్దతు ప్రకటించారు?
A2: తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మరియు పార్టీ నాయకత్వం వీటికి సంపూర్ణ మద్దతు అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: