Telangana Agricultural: హైదరాబాద్ : వ్యవసాయ విద్య, పరిశోధన రంగంలో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక అడుగు ముందుకేసింది. ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (sudney university) ప్రొఫెసర్ ఆయాన్ అండర్సన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులకు మధ్య హైదరాబాద్ లో కీలక సమావేశం జరిగింది. వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్ట్రాస్ జానయ్య ఇతర అధికారులతో కలసి ఆస్ట్రేలియా ప్రతినిధి బృందంతో చర్చలు జరిపింది. ఈ నేపధ్యంలో వ్యవసాయ విద్య, పరిశోధన రంగాలలో సంయుక్తంగా చేపట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడేళ్లు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోను, నాలుగో సంవత్సరం సిడ్నీ లోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో చదువుకునే విధంగా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం పై ఒప్పందం జరిగింది. నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ (Agriculture) డిగ్రీని, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ వ్యవసాయ ఆహార శాస్త్రంలో డిగ్రీని పొందుతారు.
Hyd Crime:ప్రేమ పేరుతో మోసపోయిన యువతి.. అబార్షన్ వికటించి మృతి

విద్యార్థులు తదుపరి పీజీ, పీహెచ్డ్ కోర్సులను వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో నేరుగా చేసుకొనే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కాగా ఈ తెలంగాణ నుండి ప్రతి సంవత్సరం 25 నుంచి 30 మంది విద్యార్థులకు ఆస్ట్రేలియాలో నేరుగా చదువుకునే అవకాశం కలుగుతుంది. సందర్భంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ విసి అయాన్ అండర్సన్ మాట్లాడుతూ భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఇప్పటికే డబ్ల్యూ. ఎస్.యుతో అవగాహన కుదుర్చుకుందన్నారు. దాని ప్రకారం Telangana Agricultural భారతదేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో (university) సంయుక్తంగా విద్య, పరిశోధనా రంగాలలో కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. గత కొన్ని నెలలుగా చర్చల అనంతరం ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం ఈ సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టే విధంగా అగ్రిరోబోటిక్స్, కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికపరిజ్ఞానాలపై ఒప్పందం కుదిరిందన్నారు.
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏ యూనివర్సిటితో ఒప్పందం కుదుర్చుకుంది?
ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీతో.
విద్యార్థులకు ఏ డిగ్రీలు లభిస్తాయి?
బీఎస్సీ (అగ్రికల్చర్) మరియు బీఎస్సీ (అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ సైన్స్).
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: