బీహార్(Bihar Elections) రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఆర్జేడీ (RJD) అగ్రనేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేడీయూ (JDU) పార్టీ నితీశ్ చేతిలో ఎక్కువ కాలం నిలవదని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ భవిష్యత్తు త్వరలోనే లలన్ సింగ్ (Lalan Singh), సంజయ్ ఝా (Sanjay Jha), విజయ్ చౌదరి (Vijay Choudhary) చేతుల్లోకి వెళ్లనుందని పేర్కొన్నారు.తేజస్వి యాదవ్ మాట్లాడుతూ — “ఆ ముగ్గురు నేతలు ఇప్పటికే బీజేపీకి దగ్గరయ్యారు. నితీశ్ కుమార్ రాజకీయంగా సర్వనాశనం అయ్యారు. జేడీయూ అంతర్గతంగా బలహీనపడుతోంది” అని ఆరోపించారు.
Read also: Bihar Elections: ఫస్ట్ లిస్ట్ లో నితీష్ కు దక్కని చోటు

నామినేషన్ దాఖలులో తేజస్వి ధీమా
రాఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి యాదవ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “రాఘోపూర్ ప్రజలు నాకు రెండుసార్లు గెలుపు వరం ఇచ్చారు. ఈసారి కూడా అదే నమ్మకంతో గెలుస్తానని విశ్వసిస్తున్నాను” అని అన్నారు.బీహార్ ఎన్నికల(Bihar Elections) తొలి దశలో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో నామినేషన్‌ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రధాన నేతల్లో తేజస్వి యాదవ్ (రాఘోపూర్)తో పాటు, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) లఖిసరాయ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
బీహార్ రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది
నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ భవిష్యత్తుపై తేజస్వి(Tejashwi Yadav) చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రాబోయే ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ మధ్య పోటీ మరింత ఉత్కంఠగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: