हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News: Bihar Elections: ఫస్ట్ లిస్ట్ లో నితీష్ కు దక్కని చోటు

Vanipushpa
Latest Telugu News: Bihar Elections: ఫస్ట్ లిస్ట్ లో నితీష్ కు దక్కని చోటు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections 2025) నేపథ్యంలో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్(cm-nitish-kumar) నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్ జేడీయూ) పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్డీఏ సీట్ల పంపకంలో భాగంగా తమకు కేటాయించిన 101 సీట్లలో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర కేబినెట్ మంత్రులైన మహేశ్వర్ హజారీ (కల్యాణ్‌పూర్), రత్నేష్ సదా (సోన్‌బర్సా), విజయ్ కుమార్ చౌదరి (సరైరంజన్), శ్రవణ్ కుమార్ (నలంద) వంటి సీనియర్ నాయకులకు మళ్లీ టికెట్లు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే అనంత సింగ్‌కు మోకామా స్థానం నుంచి టికెట్ కేటాయించడం గమనార్హం. ఈ తొలి జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు.

Read Also: Chhattisgarh: మావోయిస్టులకు షాక్..27 మంది లొంగుబాటు

Bihar Elections: ఫస్ట్ లిస్ట్ లో నితీష్ కు దక్కని చోటు
Bihar Elections: ఫస్ట్ లిస్ట్ లో నితీష్ కు దక్కని చోటు

అయితే తమ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఆశించినట్లుగా ఉన్న సోన్‌బర్సా, రాజ్‌గిర్, మోర్వా, గాయ్‌ఘాట్ వంటి కీలక స్థానాల్లో జేడీయూ అభ్యర్థులను నిలబెట్టడం కూటమిలో అంతర్గత విభేదాలకు సంకేతంగా చెప్పుకోవచ్చు. జేడీయూ తొలి జాబితాను విడుదల చేయడంతో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రేపటి నుంచి తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ సారి కూడా నితీష్ కుమార్ పోటీలో నిలబడటం లేదు. నితీష్ కుమార్ గత సుమారు రెండు దశాబ్దాలుగా (1985 తర్వాత) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

71 మంది అభ్యర్థులతో బీజేపీ లిస్టు

ఇక బీజేపీ(bjp) నిన్న తమ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 71 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని పార్టీ తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. బీజేపీ తన తొలి జాబితాలో తొమ్మిది మంది మహిళలను బరిలోకి దింపింది. వీరిలో రేణు దేవి, గాయత్రి దేవి, దేవంతి యాదవ్, రమా నిషాద్ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ నాయకులు హాజరైన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఈ జాబితాను విడుదల చేశారు.

243 సీట్లకు గానూ బీజేపీ, జేడియూ చెరో 101 చోట్లలో పోటీ

243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(bihar-assembly-elections) రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6 మొదటి దశ, నవంబర్ 11 రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్ ఎన్నికలకు జేడియూ, బీజేపీ రెండూ సీట్ల పంపకాలను ఖరారు చేశాయి. ఒప్పందం ప్రకారం, 243 సీట్లకు గానూ బీజేపీ, జేడియూ చెరో 101 చోట్లలో పోటీ చేస్తుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో పోటీ చేస్తుంది. రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా (జితన్ రామ్ మాంఝీ)లకు ఒక్కొక్కరికి ఆరు సీట్లు కేటాయించారు. NDA కూటమిలో JD(U), LJP (రామ్ విలాస్), HAM (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి.

నితీష్ కుమార్ యాదవ్ ఎవరు?

నితీష్ కుమార్ (జననం 1951 మార్చి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం బీహార్ రాష్టానికి 22వ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. కుమార్ ఇంతకు మునుపు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు.

నితీష్ కుమార్ ఫస్ట్ సీఎం ఎప్పుడు?

మార్చి 2000లో, కేంద్రంలోని వాజ్‌పేయి ప్రభుత్వం ఆదేశం మేరకు నితీష్ మొదటిసారి బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు, సమతా పార్టీ సభ్యుడిగా. 324 మంది సభ్యులున్న సభలో NDA మరియు మిత్రదేశాలకు 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా, లాలూ ప్రసాద్ యాదవ్‌కు 159 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870