हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Railway: టికెట్ లేని ప్రయాణికుల వద్ద నుండి భారీ వసూళ్లు

Anusha
Latest News: Railway: టికెట్ లేని ప్రయాణికుల వద్ద నుండి భారీ వసూళ్లు

మన దేశ రైల్వే (Railway),బస్సులు ప్రయాణించే విధానంలో టికెట్ లేని ప్రయాణం నేరం.అయితే, దీనికి వ్యతిరేకంగా చాలా మంది ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ టికెట్ లేకుండా రైళ్లలో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. టికెట్ (Ticket) తీసుకొని వారు తప్పుడు మార్గాల్లో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో రైల్వే (Railway) అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ, నిబంధనలను అమలు చేస్తారు.

Read Also: Hrithik Roshan: హృతిక్‌ రోషన్‌కు హైకోర్టులో భారీ ఊరట

తాజాగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పరిధిలో ఇదే జరిగింది. రైల్వే చరిత్రలో ఒక్కరోజే అత్యధికంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి జరిమానాలు వసూలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో టీసీలు, రైల్వే సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి, టికెట్ లేని ప్రతి ఒక్కరిని గుర్తించి, ఫైన్ వసూలు చేశారు.

ఫలితంగా, ఒక్కరోజే రూ. 1.08 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేయడం గమనార్హం. ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే సరికొత్త రికార్డు.ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఇతి పాండే ఆదేశాల మేరకు.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని.. హైదరాబాద్ , సికింద్రాబాద్, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు, నాందేడ్‌ డివిజన్‌లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు అధికారులు.

Railway
Railway

టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 16,105 మంది ప్రయాణికులను

ఈక్రమంలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 16,105 మంది ప్రయాణికులను గుర్తించి.. వారి వద్ద నుంచి రూ.1.08 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసి రికార్డు క్రియేట్ చేశారు. అయితే దీని కన్నా ముందు గతంలో అనగా అక్టోబర్ 6న నిర్వహించిన డ్రైవ్‌లో రూ.92.4 లక్షలు వసూలు చేశారు.

అప్పటివరకు అదే అత్యధిక మొత్తం.మంగళవారం వసూలు చేసిన జరిమానా మొత్తం.. భారతీయ రైల్వే (Indian Railways) చరిత్రలోనే.. ఒకరోజులో అత్యధికంగా వసూలు చేసిన జరిమానా మొత్తంగా చరిత్ర సృష్టించింది. ఈ జరిమానా వసూళ్లలో విజయవాడ డివిజన్‌ (Vijayawada Division) ముందుంది. ఇక్కడ రూ.36.91 లక్షలు వసూలు చేశారు.

ఆ తర్వాత గుంతకల్లు డివిజన్ (Guntakal Division) నుంచి రూ.28 లక్షలు, సికింద్రాబాద్‌ డివిజన్ నుంచి రూ.27.9 లక్షలు వసూలు చేశారు. గుంటూరు డివిజన్ (Guntur Division) పరిధిలో రూ.6.46 లక్షలు, హైదరాబాద్‌ డివిజన్‌ (Hyderabad Division) లో రూ.4.6 లక్షలు, నాందేడ్‌ డివిజన్ నుంచి రూ.4.08 లక్షల చొప్పున జరిమానా వసూలు చేశారు అధికారులు. ఈ తనిఖీలు టికెట్ లేకుండా ప్రయాణించేవారికి ఒక హెచ్చరికగా నిలుస్తాయంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870