బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) మరింత ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. గత వారం ఆదివారం జరిగిన డబుల్ ఎలిమినేషన్ (Double elimination) తో హౌస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఫ్లోరాశైనీ, దమ్ము శ్రీజ, ఇద్దరు కంటెస్టెంట్లు ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా షో నుంచి తప్పుకున్నారు.
Read Also: Smriti Irani: దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్
వీరి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆరుగురు కొత్త వైల్డ్‌కార్డ్ ఎంట్రీ (Wildcard entry) లు చోటు చేసుకున్నాయి. వీరే — అలేఖ్య, చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దివ్వల మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్, సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా.
ఇక కొత్త కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 9)నిజంగానే రణరంగంగా మారింది. నామినేషన్స్ హోరా హోరీగా జరిగాయి. కాగా ఈ వారం నామినేషన్స్ కు సంబంధించి వైల్డ్‌కార్డ్స్ ను మినహాయించాడు బిగ్‌బాస్. అయితే నామినేషన్ చేసే అధికారం ఎవరికి ఇవ్వాలి.. నామినేట్ చేసిన వాళ్ల నుంచి ఎవరిని సెలక్ట్ చేయాలి అనే పవర్స్ మాత్రం వైల్డ్‌కార్డ్స్ కే అప్పగించారు.

తమకి నచ్చిన హౌస్‌మేట్‌కి నామినేషన్
ఇందుకోసం ‘బాల్ ఆఫ్ ఫైర్’ అంటూ ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా ఎవరు బాల్ పట్టుకుంటే వారు.. తమకి నచ్చిన హౌస్‌మేట్‌కి నామినేషన్ చేసే అవకాశం ఇవ్వొచ్చు. అప్పుడు ఆ ఇంటి సభ్యుడు ఇద్దరు వ్యక్తులన్ని నామినేట్ చేయాలి.
కానీ ఇందులోనుంచి ఒకరిని తప్పించి ఒకరిని మాత్రమే నామినేషన్‌లో ఉంచే అధికారం ఆ బాల్ అందించిన వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ చేతిలో ఉంటుంది.ఈ క్రమంలో ‘బాల్ ఆఫ్ ఫైర్’ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో నిలిచారు. సుమన్ శెట్టి, భరణి, తనూజ, డీమాన్, దివ్య నికితా నామినేషన్‌ల్స్ లో నిలిచారు.
అయితే కెప్టెన్ కల్యాణ్ కు బిగ్‌బాస్ ఒక పవర్ ఇచ్చాడు. పాత హౌస్‌మేట్స్ నుంచి నామినేషన్‌లో లేని ఒక్కరిని నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో కల్యాణ్.. రాము రాథోడ్ ను డైరెక్ట్ గా నామినేట్ చేశాడు. అలా ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: