ఎన్నికల ప్రచారంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (ECI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఎలక్ట్రానిక్ మీడియా వంటి వేదికలపై ప్రచార ప్రకటనలు ఇవ్వాలనుకుంటే, ఇకపై తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. బుధవారం ఈసీ (ECI) నూతన ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ నియమం దేశవ్యాప్తంగా వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
Read Also: RSS: ఆర్ఎస్ఎస్ పై జడేజా ప్రశంసలు
రాబోయే ఉపఎన్నికలను (By-elections) దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఈ చర్య చేపట్టింది. బిహార్, జమ్మూ కశ్మీర్‌తో పాటు మరో ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రచారంలో అసత్య ప్రచారం, తప్పుడు సమాచారం లేదా ప్రలోభపెట్టే ప్రకటనలు బయటకు రాకుండా నియంత్రణకు ఈ కొత్త విధానం అనుసరించనుంది. రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు ఏ ప్రకటననైనా విడుదల చేయడానికి ముందు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు (MCMC) అనుమతి తప్పనిసరిగా పొందాలి.

కేవలం ప్రకటనలకే పరిమితం కాదు
ఈ కమిటీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే పార్టీలు, అభ్యర్థులు తమ ప్రకటనలను ప్రసారం చేయాల్సి ఉంటుంది.ఈ నిబంధన కేవలం ప్రకటనలకే పరిమితం కాదు. నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అభ్యర్థులు, పార్టీలు తమ అధికారిక సోషల్ మీడియా (Social media) ఖాతాలు, వెబ్ ప్లాట్‌ఫాంల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది.
అంతేకాకుండా, ప్రకటనల రూపకల్పన (కంటెంట్ క్రియేషన్) కోసం అయిన ఖర్చుతో సహా, ప్రచారానికి సంబంధించిన పూర్తి వ్యయ వివరాలను ఎన్నికలు ముగిసిన 75 రోజుల్లోగా సమర్పించాలని స్పష్టం చేసింది.
వివిధ మీడియా మాధ్యమాలలో వచ్చే వార్తలను ఎంసీఎంసీ బృందాలు నిశితంగా గమనిస్తాయని, పెయిడ్ న్యూస్ అని అనుమానం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈ కొత్త నిబంధనలతో డిజిటల్ ప్రచారంపై పూర్తిస్థాయి నియంత్రణ తీసుకురావాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: