ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ముగింపునకు సంబంధించి శాంతి ఒప్పందంపై ఈజిప్టు వేదికగా దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పై ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అంతేకాదు, పాక్ ప్రధానిని పలకరిస్తూనే భారత్‌పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇక ఇదే సమావేశంలో ట్రంప్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) పొగడ్తలతో ముంచెత్తారు. షరీఫ్ మాటలకు ఇటలీ ప్రధాని మెలోనీ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ ఎంతో కృషి చేసినట్లు పాక్ ప్రధాని (Shehbaz Sharif) చెప్పారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధించడానికి ట్రంప్ అసాధారణ ప్రయత్నాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆయన జోక్యం చేసుకుని ఉండకపోయి ఉంటే ఆ ఘర్షణలు పశ్చిమాసియాకు విస్తరించి ఉండేవన్నారు. ట్రంప్.. నిజంగా శాంతిని కోరుకునేవారంటూ ప్రశంసించారు. ఆయన ఇప్పటి వరకూ ఏడు యుద్ధాలు ఆపారని.. ఇది (గాజా) ఎనిమిదో యుద్ధం అంటూ చెప్పుకొచ్చారు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. అందుకే నోబెల్ శాంతి బహుమతి కి ఆయన్ను నామినేట్ చేసినట్లు చెప్పారు. ఆ ప్రైజ్ అందుకునేందుకు ఆయన అర్హుడని పేర్కొన్నారు. అయితే, పాక్ ప్రధాని(Shehbaz Sharif) ప్రసంగిస్తున్న సమయంలో స్టేజ్‌పై ఉన్న ఇటలీ ప్రధాని మెలోనీ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నోటి మీద చేయి వేసుకుని చూస్తూ ఉండిపోయారు. ఆమె రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
షెహబాజ్ షరీఫ్ జననం, విద్యాభాస్యం?
షెహబాజ్ షరీఫ్ 1951 సెప్టెంబరు 23న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు. ఆయన లాహోర్ ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. షాబాజ్ షరీఫ్ కుటుంబం భారత్ నుంచి వచ్చి పాకిస్థాన్ లో స్థిరపడ్డారు, అతని తండ్రి ముహమ్మద్ షరీఫ్ వ్యాపారవేత్త. వ్యాపారం నిమిత్తం తరచూ కాశ్మీర్ వెళ్లేవాడు. తరువాత అతని కుటుంబం పంజాబ్ లోని అమృత్సర్ లో స్థిరపడింది. బ్రిటీష్ రాజ్ నుండి స్వాతంత్ర్యం పొందిన సమయంలో 1947లో భారతదేశం పాకిస్తాన్ విభజించబడినప్పుడు, ముహమ్మద్ షరీఫ్ తన కుటుంబంతో లాహోర్ లో స్థిరపడ్డారు.
షెహబాజ్ షరీఫ్ రాజకీయ జీవితం?
షెహబాజ్ షరీఫ్ 1988లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1988 నుండి 1990 వరకు పంజాబ్ శాసనసభ సభ్యుడు, షాబాజ్ 1990 నుండి 1993 వరకు జాతీయ అసెంబ్లీ సభ్యుడు గెలిచాడు. షెహబాజ్ షరీఫ్ పంజాబ్ ప్రావిన్స్ (పాకిస్తాన్) కి 1997 ఫిబ్రవరిలో తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1999 అక్టోబరు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. షెహబాజ్ షరీఫ్ ను 1999లో అప్పటి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు తర్వాత, ఖైదు చేయబడ్డాడు. తరువాత ఆయనను సౌదీ అరేబియాకు బహిష్కరించారు. షరీఫ్ 2007లో పాకిస్థాన్ కు తిరిగి వచ్చి 2008 జూన్ నుండి రెండవసారి, తరువాత 2013 నుండి 2018 వరకు మూడవసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper :https://epaper.vaartha.com/
Read Also: