హైదరాబాద్ : రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను హ్యామ్ HAM విధానంలో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. అంతేకాదు దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారుల (National Highways) పనులు హ్యామ్ విధానంలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25,661 కోట్ల నిధులను జాతీయ రహదారులకు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 431 కిలోమీటర్ల మేర రహదారులను హ్యామ్ పద్దతిలో నిర్మించేందుకు అంచనాలు రూపొందించారు. హ్యామ్ విధానంలో ఎన్ హెచ్ఎఐ నిర్మించే రహదారులను కేంద్ర ప్రభుత్వం, (central dovernment) నిర్మాణ సంస్థలు 40:60 నిష్పత్తిలో నిధులు వ్యయాలను పంచుకొంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జాతీయ స్థాయిలో 124 జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. రూ.3,45,466 కోట్లతో 6,376 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసి చేపట్టే ఈ రహదారుల నిర్మాణాల తాత్కాలిక జాబితాలో రాష్ట్రానికి చెందిన ఐదు జాతీయ రహదారులకు చోటు దక్కింది.
SP: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టుకు నిజాం వారసులు

HAM Model
ఆర్మూర్ – జగిత్యాల, జగిత్యాల-మంచిర్యాల్ కారిడార్లో భాగమైన జాతీయ రహదారిని నాలుగు లేన్లకు విస్తరించనున్నారు. అంతే కాకుండా జగిత్యాల- కరీంనగర్ మధ్యలో కూడా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ ట్రిపుల్ ఆర్, హైదరాబాద్-పనాజీ సెక్షన్ పరిధిలోని మహబూబ్ నగర్ Mahbubnagar నుంచి రాయచూర్ ఎస్.హెచ్ 167 రహదారి పనులు చేపట్టేందుకు మొత్తం రూ.25.661 కోట్ల నిధులు మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ HAM రహదారుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు 160 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.15,627 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనిని జాతీయ రహదారిగా గుర్తించి ఎన్.హెచ్ 161 ఏఏ నెంబరును కూడా ఖరారు చేసింది. హైదరాబాద్పనాజీ సెక్షన్ పరిధిలోని మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ ఎన్.హెచ్ 167 వెళ్లే రహదారి, మహబూబ్ నగర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని గుడెబల్లూర్ (రాయచూరుకు సమీపంలో) వరకు ఉన్న 80 కి.మీ డబుల్ రోడ్డును రూ.2,662 కోట్ల అంచనాలతో ఫోర్ లైన్గా విస్తరించనున్నారు. జగిత్యాల-మంచిర్యాల్ జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.2,550 కోట్ల వ్యయంతో 68 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టనున్నారు. ఆర్మూర్ (Armoor) – జగిత్యాల 64కిలోమీటర్ల జాతీయరహదారి నిర్మాణానికి రూ.2,338కోట్లు మంజూరు చేశారు. జగిత్యాల కరీంనగర్ 59కిలోమీటర్ల జాతీయరహదారి నిర్మాణ పనులకు రూ.2,384కోట్లు మంజూరు చేశారు.
కేంద్రం ఎన్ని జాతీయ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది?
దేశవ్యాప్తంగా మొత్తం 124 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టులకు మొత్తం ఎంత నిధులు కేటాయించారు?
2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.25,661 కోట్లు జాతీయ రహదారుల అభివృద్ధికి కేటాయించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: