ఒంటరిగా బరిలోకి దిగిన ఎంఐఎం
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఆర్జేడీతో పొత్తు కోసం ఎంఐఎం(AIMIM Bihar Elections) చర్చలు జరిపినా స్పందన రాకపోవడంతో, అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో ఎంఐఎం తమ మొదటి అభ్యర్థుల జాబితాలో 32 అసెంబ్లీ స్థానాలకు పేర్లు ప్రకటించింది.ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంపై పార్టీ దృష్టి సారించింది.
Read also: Rahul Gandhi: ‘ఓటు చోరీ’ సిట్ విచారణకు సుప్రీం నో

32 స్థానాల జాబితా – సీమాంచల్ ఫోకస్
ఎంఐఎం(AIMIM Bihar Elections) ఈ జాబితాలో మొత్తం 16 జిల్లాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కిషన్‌గంజ్, కోచాధామన్, బహదుర్‌గంజ్, ఠాకుర్‌గంజ్, బాయసీ, కద్వా, అరరియా వంటి నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి.
జాబితాను పాట్నాలో కాకుండా కిషన్‌గంజ్‌లోని సింఘియా కార్యాలయంలో విడుదల చేయడం గమనార్హం. రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ మరియు జాతీయ ప్రతినిధి ఆదిల్ హుసైన్ మీడియా ముందు అభ్యర్థుల పేర్లు వెల్లడించారు.
ఆర్జేడీ స్పందించలేదు – ఎంఐఎం నిర్ణయం స్పష్టం
ఇమాన్ మాట్లాడుతూ, “సెక్యులర్ ఓట్లు చీలకుండా ఉండాలని ఆర్జేడీతో పొత్తు కోరినా వారు స్పందించలేదు. అందుకే స్వతంత్రంగా పోటీ చేస్తున్నాం,” అన్నారు.
అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమానత్వం, ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.
భవిష్యత్ జాబితాల్లో మహిళలకు గౌరవప్రదమైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఎంఐఎం ఈ నిర్ణయంతో సీమాంచల్ ప్రాంతాన్ని తమ బలమైన స్థావరంగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఎంఐఎం(AIMIM Bihar Elections) ఒంటరి పోటీ కారణంగా ముస్లిం ఓట్లు చీలిపోవడం వల్ల ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి నష్టం జరుగవచ్చు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలకు కొత్త మలుపు తిప్పే అవకాశముంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: