సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన “లిటిల్ హార్ట్స్” (Little Hearts) అనేది ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా గా, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది, సినిమా, చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో అద్భుత స్పందనను పొందింది. ప్రేక్షకులు ఈ సినిమాను ఇష్టపడ్డారు. థియేటర్ (theater) లో మాత్రమే కాదు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా లిటిల్ హార్ట్స్ భారీ విజయం సాధిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్‌ను దాటడానికి సిద్ధంగా ఉంది.
Read Also: Telusu Kada Movie: తెలుసు కదా ట్రైలర్ చూసారా?
మౌళి, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రం, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సింపుల్ లవ్ స్టోరీతో పాటు ఎమోషన్, కామెడీ, కుటుంబ విలువలు అన్నీచక్కగా సరిపోవడం ఈ సినిమా విజయానికి కీలకంగా మారాయి.
థియేటర్ రిలీజ్ సమయంలోనే ఈ చిత్రం మంచి రివ్యూలు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి ఆశ్చర్యపరిచింది.ఇప్పుడు అదే ఊపును డిజిటల్ వేదికపై కొనసాగిస్తూ, కంటెంట్ బలంగా ఉంటే అది సినిమాను నిలబెట్టగలదని మరోసారి రుజువు చేస్తోంది.

ఎప్పుడైనా చూసేలా
సాయి మార్తాండ్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రల మధ్య రిలేషన్, సన్నివేశాల ట్రీట్మెంట్, ఎమోషనల్ డెప్త్ ఇవన్నీ నేచురల్‌గా ఉండటంతో ప్రేక్షకులు చిత్రంతో బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎలాంటి హంగామా లేకుండా ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగిన సినిమాగా “లిటిల్ హార్ట్స్” (Little Hearts)నిలుస్తోంది.
వారంవారం మారిపోయే టాలీవుడ్ ట్రెండ్స్‌లో, నిశబ్ద విజయం సాధిస్తున్న “లిటిల్ హార్ట్స్” వంటి సినిమాలు, వ్యూయర్ మూడ్‌కు తగ్గట్లుగా, ఎప్పుడైనా చూసేలా ఉండే కంటెంట్‌తో ఉంటే ఎంతటి విజయాన్ని సాధించగలవో చూపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: