పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల సంభవించిన భయానక వరదలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Banerjee) ఘాటుగా స్పందించారు. భూటాన్ Bhutan నుంచి అకస్మాత్తుగా విడుదలైన నీటివల్లే రాష్ట్రంలోని అనేక జిల్లాలు ముంపుకు గురయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఈ కారణంగా జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి భూటాన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని, నష్టపరిహారం చెల్లించాలని మమతా డిమాండ్ చేశారు. జల్‌పాయీగుడీ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన ఆమె, సహాయక చర్యలను సమీక్షించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సాయాన్ని చేస్తున్నా, కేంద్రం ఇప్పటివరకు ఒక్క రూపాయి సాయం చేయలేదు,” అని మమతా ఆరోపించారు.
Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో HAAM & RLM సీట్లు

ఆ దేశమే నష్ట పరిహారం చెల్లించాలి
భారత్-భూటాన్ మధ్య ఉమ్మడి నదీ కమిషన్ ఏర్పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, అందులో పశ్చిమ బెంగాల్ (Bengal) రాష్ట్రానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ నెల 16న జరగబోయే కేంద్ర సమావేశానికి రాష్ట్ర అధికారులు హాజరుకానున్నారని తెలిపారు. ఇటీవల డార్జిలింగ్, జల్‌పాయీగుడీ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 32 మంది మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భూటాన్,Bhutan నేపాల్‌లలోనూ (Nepal) భారీ వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలను మమతా బెనర్జీ ఇది రెండోసారి సందర్శించారు.
పశ్చిమ బెంగాల్‌లో వరదలకు కారణమని మమతా బెనర్జీ ఎవరిని ఆరోపించారు?
భూటాన్ నుంచి ఆకస్మికంగా విడుదలైన నీటివల్లే వరదలు సంభవించాయని మమతా బెనర్జీ ఆరోపించారు.
భూటాన్‌పై మమతా బెనర్జీ ఏ డిమాండ్ చేశారు?
వరదల కారణంగా జరిగిన నష్టానికి భూటాన్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: