సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చొరబాటుదారుడని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ఆయనను అక్కడకు పంపాలని అన్నారు. ఆదివారం రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా లక్నోలోని లోహియా పార్క్‌ను అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

కాగా, వలసదారులకు సంబంధించి బీజేపీ వద్ద నకిలీ గణాంకాలున్నాయని అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) విమర్శించారు. ‘కొందరు వ్యక్తులు వలసల గణాంకాలు ఇస్తున్నారు. మనకు కూడా యూపీలో చొరబాటుదారులు ఉన్నారు. ముఖ్యమంత్రి (ఆదిత్యనాథ్) ఉత్తరాఖండ్‌కు చెందినవారు. మేం ఆయనను ఉత్తరాఖండ్‌కు పంపాలనుకుంటున్నాం. బీజేపీలో చొరబాటుదారులు ఉన్నారా లేదా చెప్పండి మరి?’ అని అన్నారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ సభ్యుడు కాదని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ‘ఆయన (ఆదిత్యనాథ్) చొరబాటుదారుడే కాదు. సైద్ధాంతిక కోణంలో కూడా చొరబాటుదారుడు. ఆయన బీజేపీ సభ్యుడు కాదు. మరొక (పార్టీ) సభ్యుడు. కాబట్టి, ఈ చొరబాటుదారులను ఎప్పుడు తొలగిస్తారు?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అఖిలేష్ యాదవ్ ఎన్ని రోజులు సీఎంగా ఉన్నారు?
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ 2012 నుండి 2017 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు; 38 సంవత్సరాల వయసులో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడు. మాయావతి, అఖిలేష్ యాదవ్ మరియు యోగి ఆదిత్యనాథ్ అనే ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే ఐదు సంవత్సరాల అధికారిక పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.
అఖిలేష్ యాదవ్ డిగ్రీ?
ఆయన రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లోని ధోల్‌పూర్ మిలిటరీ స్కూల్‌లో విద్యనభ్యసించారు, తరువాత భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి పర్యావరణ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper :https://epaper.vaartha.com/
Read Also: