గత కొన్ని రోజుల నుంచి అమెరికా(America)లో వరుస కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సౌత్ కరోలినా(South Carolina) రాష్ట్రంలో ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్న సెయింట్ హెలెనా ద్వీపంలోని ఒక రద్దీగా ఉండే బార్‌లో కొందరి మధ్య గొడవ జరగ్గా.. తీవ్రమై కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో తీవ్రంగానే కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Gaza: ఎట్టకేలకు ఏడుగురు బందీలను విడుదల చేసిన హమాస్
అమెరికా జనాభా ఎంత?
అమెరికా జనాభా 34 కోట్లు
అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి?
అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, వీటితో పాటు వాషింగ్టన్, D.C. అనే ఒక సమాఖ్య జిల్లా ఉంది. ఈ 50 రాష్ట్రాలు ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నాయి మరియు ఒక్కొక్క రాష్ట్రానికి దాని స్వంత ప్రభుత్వం, రాజ్యాంగం మరియు చట్టాలు ఉన్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: