పట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ(Bihar Assembly) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నవాడా నియోజకవర్గం(Constituency) ఎమ్మెల్యే విభా దేవి, రాజౌలీ ఎమ్మెల్యే ప్రకాష్ వీర్ ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు వారు స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. వీళ్లిద్దరూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Gaza: ఎట్టకేలకు ఏడుగురు బందీలను విడుదల చేసిన హమాస్

రాజీనామాలకు కారణాలు, నేపథ్యం
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో, ఆగస్టు 22న గయాజీలో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో అప్పుడే వీరు ఎన్‌డీఏ కూటమిలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కొన్ని రోజులకు వారు రాజీనామా చేశారు. విభా దేవి భర్త, మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్, పోక్సో కేసు కింద శిక్ష అనుభవించి ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆర్జేడీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో విభా దేవి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.
ప్రకాష్ వీర్ వైఖరి, సంచలనం
మరోవైపు, ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ వీర్‌కు ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో విభేదాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన కూడా తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. అధికార ఎన్‌డీఏ, ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొన్న సమయంలో, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్జేడీకి రాజీనామా చేయడం ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
ఆర్జేడీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవరు?
నవాడా ఎమ్మెల్యే విభా దేవి, రాజౌలీ ఎమ్మెల్యే ప్రకాష్ వీర్.
వీరు ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది?
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: