కాలిఫోర్నియాలో ఘోర ఘటన
అమెరికా(United States) దక్షిణ కాలిఫోర్నియాలోని(California Helicopter Crash) హంటింగ్టన్ బీచ్ సమీపంలో ఓ హెలికాప్టర్ భయంకర ప్రమాదానికి గురైంది. మొదట సాధారణంగా ప్రయాణిస్తున్న ఆ హెలికాప్టర్, ఒక్కసారిగా కంట్రోల్ తప్పి గాల్లో గిరగిరా తిరుగుతూ కిందకు కూలిపోయింది. క్షణాల్లోనే చెట్లపై పడిపోయి ధ్వంసమైంది.
Read also: Filmfare 2025 Winners: ఫిల్మ్ ఫెయిర్ 2025లో ‘లాపతా లేడీస్’ సత్తా

ఐదుగురికి గాయాలు – దర్యాప్తు ప్రారంభం
ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరియు నేలపై ఉన్న మరియు ముగ్గురు గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలం కాలిఫోర్నియా(California Helicopter Crash) చేరుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
హెలికాప్టర్ కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. గాల్లో తిరుగుతూ కింద పడిపోతున్న వీడియోను చూసి ప్రజలు షాక్‌కు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
హెలికాప్టర్ ప్రమాదం ఎక్కడ జరిగింది?
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో, హంటింగ్టన్ బీచ్ సమీపంలో జరిగింది.
ఈ ప్రమాదంలో ఎవరైనా మృతి చెందారా?
లేదు, అయితే ఐదుగురికి గాయాలయ్యాయి
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: