బీహార్ (Bihar) రాష్ట్రంలోని నలంద జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.ప్రియురాలిని వివాహం చేసుకోవాలనే పక్కా ప్లాన్‌తో ఓ వ్యక్తి తన తన రెండవ భార్యకు నిప్పంటించాడు.శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు వికాస్ కుమార్ (Vikas Kumar) ఐదు సంవత్సరాల క్రితం సునీతా దేవిని (25) వివాహం చేసుకున్నాడు.
Old Mobiles : పాత ఫోన్లు అమ్ముతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త.!
అయితే, సునీత (Sunitha) తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, తన కూతురితో వివాహం జరిగిన తర్వాతే వికాస్ కుమార్‌కు ఇప్పటికే ఒకసారి వివాహం అయిందని, అతను తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలిసిందన్నారు.
దాంతో కుమార్ కుటుంబం సునీతను తమతోనే ఉండమని ఒప్పించింది. కానీ, అందుకు ఆమె అంగీకరించలేదు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరూ పుట్టిన కొద్దికాలానికే మరణించారు. ఈ క్రమంలోనే కుమార్ తన స్నేహితురాలిని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు చెలరేగాయి.

దుర్గా పూజ పండుగకు ముందు
చివరికి సునీత అతన్ని వదిలి తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్ళింది.అయితే, గత నెల, దుర్గా పూజ పండుగకు ముందు కుమార్ సునీత ఇంటికి వెళ్లి ఆమెను తనతో తిరిగి రమ్మని కోరాడు. భర్త మాటలు నమ్మిన సునీత అతనితో పా టు వచ్చింది. శనివారం తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో సునీత నుండి తమకు ఫోన్ వచ్చిందని,
కుమార్ తనపై పెట్రోల్ పోసి ప్రాంగణంలో బంధించాడని, ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వాల్వ్‌లను తెరిచి, వెలిగించిన అగ్గిపుల్ల విసిరి ఆమెను తగలబెట్టాడని సునీత సోదరుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం భర్త, అత్తమామలు పరారీలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: