దేశీయ సాంకేతిక రంగంలో “మేడ్ ఇన్ ఇండియా” ఆవిష్కరణలకు కేంద్రం మరింత బలం చేకూరుస్తోంది. తాజాగా కేంద్ర రవాణా, సమాచార సాంకేతిక మంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ కంపెనీ రూపొందించిన ‘Mappls’ by MapmyIndia యాప్‌ను దేశ ప్రజలకు సిఫారసు చేశారు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ఇది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయబడిన స్మార్ట్ నావిగేషన్ యాప్. చాలా ఖచ్చితమైన మ్యాపింగ్, రియల్ టైమ్ సమాచారం, రోడ్ల వివరాలతో ఇది అద్భుతంగా పనిచేస్తోంది. అందరూ ట్రై చేయండి” అని సూచించారు.
Latest News: AP: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం?
‘Mappls’ యాప్ ప్రత్యేకతలు గూగుల్ మ్యాప్స్‌కి ఏమాత్రం తీసిపోవు. ఇందులో ఉన్న ఫీచర్లు వినియోగదారులకు మరింత అనుభవజ్ఞానాన్ని అందిస్తాయి. ఈ యాప్ రోడ్లపై ఓవర్‌బ్రిడ్జ్‌లు, ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు వంటి నిర్మాణాలను స్పష్టంగా చూపిస్తుంది. అంతేకాక, నగరాల్లోని అపార్ట్మెంట్ల లోపలి భాగాల వరకు, ప్రత్యేక షాపుల స్థానం, సరిగ్గా చేరుకునే మార్గం వంటి వివరాలు కూడా చూపగల సామర్థ్యం దీనికి ఉంది. మ్యాప్మైఇండియా కంపెనీ ఇప్పటికే ప్రభుత్వ ప్రాజెక్టులకూ, జాతీయ రవాణా వ్యవస్థకూ మ్యాపింగ్ సొల్యూషన్లు అందిస్తోంది. ఇప్పుడు అదే సాంకేతికతను సాధారణ వినియోగదారులకు అందించడానికి Mappls యాప్ రూపొందించబడింది.

“ఆత్మనిర్భర్ భారత్” దిశగా ఇదో కీలకమైన అడుగు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్‌పై అధికంగా ఆధారపడిన భారతీయ వినియోగదారులు, ఇప్పుడు తమ దేశీయ ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించుకునే అవకాశం పొందుతున్నారు. డేటా భద్రత, స్థానిక భాషలలో సపోర్ట్, భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ చేసిన ఫీచర్లు వంటి అంశాలు దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. కేంద్ర మంత్రి వైష్ణవ్ అభిప్రాయం ప్రకారం, ఈ యాప్ విజయవంతమైతే భారతీయ డిజిటల్ స్వావలంబనకు మరింత బలమైన పునాది పడనుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/