కుల ఉన్మాదం మరోసారి దేశాన్ని కుదిపేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ (Pooran Kumar) ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ, “కుల ఉన్మాదానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ” అని వ్యాఖ్యానించారు.
TG Maoists: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..
రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ, ఒక సీనియర్ స్థాయి అధికారి అయినా కూడా కుల వివక్షకు గురవడం మన సమాజం ఎంత వెనుకబడి ఉందో చూపిస్తున్నదని అన్నారు. “కులం పేరుతో ఒక ఐపీఎస్ (IPS) అధికారిని వేధించడం చూస్తే, సామాన్య ప్రజల దుస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు,” అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన అణగారిన వర్గాలపై జరుగుతున్న సామాజిక అన్యాయానికి నిదర్శనమని సీఎం పేర్కొంటూ, సమాజంలో కుల వివక్ష ఇంకా బలంగా వేరుపోకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.కుల ఉన్మాదం దేశ సమాజాన్ని పీడిస్తోందని, అణగారిన వర్గాల పట్ల ద్వేషం సమాజాన్ని విషపూరితం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ అణచివేత చర్యలను
ఈ తరహా సంఘటనల వల్ల రాజ్యాంగం, సమానత్వం, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటోందన్నారు.సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ అణచివేత చర్యలను తీవ్రంగా ఖండించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పూరన్ కుమార్ (Pooran Kumar) కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: