టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే సంచలనం సృష్టించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన నటి కృతి శెట్టి (Kriti Shetty) కి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాలో బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా, హీరోగా పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటించాడు. ఆ సినిమా విడుదలైన వెంటనే కృతి శెట్టి స్టార్ హీరోయిన్‌ల సరసన నిలిచిపోయింది. ఆమె సహజమైన నటన, అమాయకమైన లుక్, అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉప్పెన సినిమాలో ‘బేబమ్మా’గా ఆమె చేసిన పాత్ర ఇప్పటికీ అభిమానులకు గుర్తుండేలా చేసింది.
Dude Movie: ప్రదీప్ రంగనాథన్ తాజా సినిమా డూడ్ అక్టోబర్ 17 విడుదల
కృతిశెట్టి ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం కృతిశెట్టికి నిరాశనే మిగిల్చాయని చెప్పాలి.కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన కస్టడీ, మనమే, ది వారియర్, మాచెర్ల నియోజకవర్గం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

తమిళంలో తన లక్‌ను పరీక్షించుకోవాలనుకున్నకృతి
ఈ వరుస ఫెయిల్యూర్స్ టాలీవుడ్ (Tollywood) లో కృతిశెట్టి ప్రయాణంపై ప్రభావం చూపించాయి. అయితే ఇక చేసేదేమి లేక తమిళంలో తన లక్‌ను పరీక్షించుకోవాలనుకున్న కృతి శెట్టి (Kriti Shetty)అక్కడ మూడు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పాపులర్ యాక్టర్లతో సినిమాలు చేసి.. షూటింగ్స్ పూర్తి చేసినా పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చాయి.తీవ్ర నిరాశలో ఉండిపోయిన కృతిశెట్టి అభిమానుల కోసం వరుసగా ఆ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.
మూడు సినిమాలు ఒకేసారి ఒకే నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఈ మూడు ప్రాజెక్టులు కూడా డిసెంబర్ నెలలోనే రిలీజ్ కాబోతుండటం విశేషం.కృతిశెట్టి కార్తీ (Karthi) తో కలిసి నటిస్తున్న వా వాథియార్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్, రవిమోహన్ Genie సినిమాలు డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి చాలా కాలంగా సరైన బ్రేక్ ఎదురుచూస్తున్న కృతిశెట్టికి ఈ డిసెంబర్ అయినా కలిసి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు, ఫాలోవర్లు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: