కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి తన స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. ఇటీవల కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం మార్పు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో సీఎం సీటు మారబోతోందనే ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో, శివకుమార్ (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ఆయన మాట్లాడుతూ, “నాకు ఏ తొందరా లేదు. నా తలరాత ఏమిటో నాకు బాగా తెలుసు. అని స్పష్టం చేశారు.

అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందని డీకే శివకుమార్ (DK Shivakumar) అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి (CM post) ని చేపట్టాలనే ఆశ ఉందని ఆయన పరోక్షంగా చెప్పారు.ప్రస్తుతం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న 50 శాతం మంది మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి.
నవంబర్ నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడి పుట్టించే దశలోకి వెళ్లాయి. డీకే శివకుమార్ మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని, రాజకీయ పరిణతి చూపుతున్నాయి. కానీ భవిష్యత్తులో సీఎం మార్పు జరుగుతుందా లేదా అన్నది మాత్రం పార్టీ హైకమాండ్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: