
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Season 9) లో మరో సూపర్ స్యాటర్డే రానుంది. ప్రేక్షకులు ఎప్పటిలాగే ఈరోజు నాగార్జున ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.నాగార్జున హౌస్‌మేట్స్‌కి ఇచ్చే క్లాస్ ఎప్పటిలాగే హైలైట్‌గా మారుతుంది. అందుకే శనివారం ప్రోమో విడుదల అవ్వగానే సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది.
Priyanka Arul Mohan: ఎక్స్‌పోజింగ్ ఫోటోస్ వైరల్.. ప్రియాంక తీవ్ర హెచ్చరిక
తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున (Nagarjuna) మాస్ అవతారంలో అదరగొట్టారు. “మమమాస్” అంటూ ఆయన ఇచ్చిన ఎంట్రీకి స్టేజ్ మొత్తమే ఊగిపోయింది. ఆయన ఎంట్రీతోనే ప్రేక్షకుల్లో ఎనర్జీ పెరిగింది. తన సొంత సినిమాలోని “మాస్” పాటను మళ్లీ రీక్రియేట్ చేస్తూ, ఆ వైబ్రేషన్‌ను మళ్లీ తెచ్చారు.
ఆరు పదుల వయసులోనూ ఇంత స్టైలిష్‌గా, యంగ్ కనిపిస్తున్నారు నాగ్. అభిమానులు “మాస్ నాగ్ ఈజ్ బ్యాక్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక స్టైలీష్ గా ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఆ తర్వాత ఒక్కొక్కరికి వాయింపు మొదలుపెట్టారు.
నువ్వు వాళ్లందరి తరుపున పోరాడి ఉండి ఉంటే
ముందుగా తనూజ (Tanuja) తో మాట్లాడుతూ..బెడ్ టాస్కులో నువ్వు ఆడిన తీరు కరెక్టేనా.. వాళ్లు ఆడపిల్లలందర్నీ తోసేద్దాం అని అన్నారు. నువ్వు వాళ్లందరి తరుపున పోరాడి ఉండి ఉంటే.. చివరకు నీ వరకు వచ్చేది కాదు కదా అంటూ నిలదీశారు.ముందే వెళ్లిపోయిన సంజన (Sanjana) మీరంతా కలిసి ఆడండి.. విడివిడిగా ఆడొద్దని చెప్తూనే ఉంది..
అప్పుడైనా నీకు బుద్ది రావాలి కదా.. భరణి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్.. ఈ ముగ్గురు నిన్ను తీయరు అని అనుకున్నావా.. ? అంటూ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత దివ్యతో మాట్లాడుతూ.. శ్రీజ విషయంలో భరణి ప్రవర్తించిన తీరు కరెక్టేనా అని అడిగారు.ఇక చివరకు భరణికి క్లాస్ స్టార్ట్ చేశారు.
వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదు
ఎంతో ఎదగాల్సిన నువ్వు పడింది బెడ్ పై నుంచి కాదు..మా దృష్టిలో నుంచి కూడా కిందపడ్డావు. వారంలో తప్పులు చేసి వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదు.. నీకు స్పష్టంగా అర్థం కావడం కోసం.. జనం నీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్లతోనే చెప్పిస్తా అంటూ ఓ అమ్మాయితో మాట్లాడించారు.
ఆమె మాట్లాడుతూ.. భరణి గారు.. మీకు బాండింగ్స తప్ప ఆట కనిపించడం లేదు.. మిమ్మల్ని అసలు బిగ్ బాస్ (Bigg Boss 9) ఉంచబుద్ది కావడం లేదు అంటూ చెప్పేసింది. ఇక ఈరోజు సాయంత్రం ఎపిసోడ్ లో మాత్రం ఒక్కొక్కరికి ఇచ్చిపడేసినట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: