సూసైడోట్లో కాంగ్రెస్ నాయకుల పేర్లు ప్రస్తావన
వేమనపల్లి : కాంగ్రెస్ (Congress) నాయకుల వేధింపులు తాళలేక వేమన పల్లి బిజెపి (BJP) మండల అధ్యక్షుడు ఏట మధుకర్ (45) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నీల్వాయి పోలీసెస్టేషన్ పరిధిలో శుక్రవారం నీల్వాయి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. దసరానాడు జరిగిన గొడవలో చింతకింది కమల తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వేయడంతో మధుకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపానికి మురైన మధుకర్ నీల్వాయి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారమందుకున్న చెన్నూరు రూరల్ సీఐ బన్సిలాల్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Read also: వారం రోజుల పాటు 32 రైళ్లు రద్దు

కాంగ్రెస్ నాయకుల వేధింపులు తాళలేక బీజేపీ మండల అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్య
మృతుడి ప్యాకెట్లో ఆత్మహత్య లేఖ లభ్యమైంది. తన మరణానికి కారణం మాజీ జడ్పీటిసి ఆర్. సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్ గాలి మధు, చింతకింది కమల కారణమని రాశాడు. తనపై తప్పు డు కేసులు పెట్టించి, పరువు ప్రతి ష్టను దెబ్బతీశారని, నా చావుకు కారణమయ్యారని రాశాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదని, అగ్రవర్ణాల పాలకులకు బుద్ధి చెప్పండి అందులో రాశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న బిజెపి, (BJP) బిఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠా యించి రాస్తారోకో చేయడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సిఐ బాన్సిలాల్ నచ్చ చెప్ప డానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బిజెపి ఆధ్వ ర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల హేమాజీ ఘటనాస్థలానికి చేరు కుని మృతుడు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ తరుపున డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: