నోబెల్ శాంతి(Nobel Prize) బహుమతిని ఈ ఏడాదికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ బహుమతిపై ఆశలు పెంచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశ తప్పలేదు. ఈ విషయంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్ కు శాంతి బహుమతి వచ్చినట్లు ‘మిస్టర్ పీస్ ప్రెసిడెంట్’ అంటూ ప్రచారం కూడా చేసింది. తీరా నోబెల్ దక్కకపోవడంతో అక్కసు పెంచుకున్న వైట్ హౌస్.. నోబెల్ కమిటీపై విమర్శలు చేసింది. బహుమతి ప్రకటనను రాజకీయం చేశారని ఆరోపించింది. ఈ విమర్శలపై నోబెల్ కమిటీ తాజాగా స్పందించింది.

ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారమే అభ్యర్థుల ఎంపిక
‘‘నోబెల్ అవార్డుల ఎంపికకు ముందు అన్నిరకాలుగా పరిశీలన జరుపుతాం. అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాతే ఎంపిక చేస్తాం. నోబెల్ ప్రైజ్ కు ఎంపికలో ప్రధానంగా ‘అభ్యర్థి చేసిన పనుల’ ను పరిగణనలోకి తీసుకుని, ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తామని పరోక్షంగా వైట్ హౌస్ కు చురకలు వేసింది. నోబెల్ పీస్ ప్రైజ్ ఎంపికలోనూ ఈ నియమాలనే పాటించామని స్పష్టం చేసింది. ఏటా నోబెల్ శాంతి బహుమతి కోసం తమకు వేలాదిగా దరఖాస్తులు వస్తాయని కమిటీ తెలిపింది. వాటన్నింటినీ పరిశీలించి నిజంగా శాంతి కోసం కృషి చేసిన వారినే బహుమతి కోసం ఎంపిక చేస్తామని, ఇందులో ఇతర అంశాలు ఏవీ ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది.
నోబెల్ శాంతి బహుమతి అంటే ఏమిటి?
నోబెల్ వీలునామా ప్రకారం, శాంతి బహుమతిని మునుపటి సంవత్సరంలో "దేశాల మధ్య సోదరభావం కోసం, స్టాండింగ్ సైన్యాలను రద్దు చేయడం లేదా తగ్గించడం కోసం మరియు శాంతి సమావేశాలను నిర్వహించడం మరియు ప్రోత్సహించడం కోసం అత్యధికంగా లేదా ఉత్తమంగా పనిచేసిన" వ్యక్తికి ప్రదానం చేస్తారు.
నోబెల్ శాంతి బహుమతిని ఎలా గెలుచుకోవాలి?
డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని అందుకోలేదు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా, అవార్డు ఫౌండేషన్, ఈ అవార్డు "దేశాల మధ్య ఫెలోషిప్‌ను పెంపొందించడానికి అత్యధికంగా లేదా ఉత్తమంగా చేసిన" వ్యక్తికి వెళ్లాలని చెబుతోంది. సరళంగా చెప్పాలంటే, మిస్టర్ ట్రంప్ అలా చేయలేదని ఓస్లోలోని పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నినా గ్రేగర్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :