54 మందికి అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
పెదనందిపాడు (గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు లోని బీసీ బాలుర హాస్టల్(Guntur BC Hostel) లో కలుషిత ఆహారం నీరు త్రాగిన 54 మంది విద్యార్థు లు వాంతులు విరోచనాలు జ్వరం తదితరు కారణాలతో శుక్రవారం ఉదయం పెదనందిపాడు మండల ఆరోగ్య కేంద్రం కు ఆటోలలో చేరుకున్నారు బాధితులకు మండల ప్రాథమిక కేంద్రంలోనూ.
Read also: India: భవిష్యత్తులో భారతదేశం అంతరిక్షంలో నంబర్ వన్గా ఉండాలి

స్థానిక ఆర్యవైశ్య కళ్యాణమండపం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలోను. వైద్య బృందం చికిత్సలు నిర్వహిస్తున్నారు. కలుషిత నీరు ఆహారం తీసుకోవడం ఆసుపత్రిలో(Hospital) చికిత్స పొందుతున్న విద్యార్థుల విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె విజయలక్షి ్మ వెంటనే పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని బాధిత విద్యార్థులకు దగ్గరుండి వైద్య చికిత్సలు చేయించారు.
జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మి బాధిత విద్యార్థులను పరామర్శించారు
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తోపాటు అధికార యంత్రాంగం మొత్తం పెదనందిపాడు చేరుకున్నారు. మండల ప్రాథమిక కేంద్రంలోనూ. కళ్యాణ మండపంలోనూ ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులను కలెక్టర్ వివరాలుఅడిగి తెలుసుకున్నారు. చికిత్స శిబిరాలను పత్తిపాడు శాసనసభ్యులు రామాం జనేయులు సందర్శించి బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరమైనప్పటికీ విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని.
16 మందిని జిల్లా ఆసుపత్రికి తరలింపు, 21 మంది కోలుకుని హాస్టల్‌కు చేరిక
బాధిత విద్యార్థుల 54 మందిలో 16 మంది విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా వైద్యశాలకు తరలించామన్నారు. 21 మంది విద్యార్థులను వైద్యులు చికిత్సతో కో లుకున్న వెంటనే అన్నపర్రు హాస్టల్(Guntur BC Hostel) కు తరలించామన్నారు. మరో 17 మంది విద్యార్థులను శిబిరంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు అం దజేస్తున్నామన్నారు. విద్యార్థులు ఆసుపత్రి పాలవటానికి కారణాలను విలేకరులు అడిగినప్పుడు.
వారు తీసుకున్న ఆహారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్ లకు పంపించామని అక్కడ నుండి వచ్చిన రిపోర్టు అనంతరం సంబంధించిన వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాసనసభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ బాధిత విద్యార్థులందరికీ వైద్య చికిత్సలు జరుగుతున్నాయని జిల్లావ్యాప్తంగా హాస్టల్లోని సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ
పరంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పెదనందిపాడు లోని 24 గంటల ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని నూతన భవనం నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు.
వైద్య బృందాలు, అధికారులు చికిత్సల పర్యవేక్షణలో
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి తో పాటు జిల్లా వ్యాధి నిరోధక టీకాలాధికారి ఏ శ్రావణ బాబు. బీసీ సంక్షేమ శాఖ అధికారి కే మయూరి. ఆర్డీవో శ్రీనివాసరావు. తహసిల్దార్ హేనా ప్రియ. డిప్యూటీ తహసిల్దార్ షేక్ కరీముల్లా. మండల రెవెన్యూ సిబ్బంది. ఇన్చార్జి ఎంపీడీవో స్వామి రెడ్డి. ఇన్చార్జి డిప్యూటీ ఎంపీడీవో నాగయ్య. ఈవో శ్వేత. మండల ఆరోగ్య కేంద్రం డాక్టర్ నందకుమార్.
డాక్టర్ ప్రియంవధ. ప్రసాద్ స్వామి. చెన్నయ్య. కాకుమాను. పాండ్రపాడు ఆరోగ్య కేంద్రాల డాక్టర్స్. ఎం ఎల్ హెచ్ ఎం పి లు. ఏ ఎన్ ఎం లు పాల్గొని బాధితులకు చికిత్సలు అంద జేస్తున్నారు. అశోక పాఠశాల సెక్రెటరీ రోటరీ క్లబ్ జిల్లా చైర్మన్ పోపూరి లక్ష్మీనారాయణ తమ పాఠశాల బస్సుల ద్వారా బాధితవిద్యార్థులను వైద్య శిబిరాలకు తరలిస్తూ సేవలందించి పలువురు మన్ననలు పొందారు.
వైద్య శిబిరాలను కూటమి నాయకులు నర్రా బాలకృష్ణ .టిడిపి మండల పార్టీ అధ్యక్షులు రాంబాబు. ఆర్ శివరామకృష్ణయ్య. డి నాగరాజు. హరిప్రసాద్ తదితరు పాల్గొని విద్యార్థులకు జరుగుతున్న వైద్య సేవలను పరిశీలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: