అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నోబెల్ శాంతి బహుమతి ఈసారి కూడా ఆయనకు దక్కలేదు. గత కొన్ని సంవత్సరాలుగా తాను ప్రపంచ శాంతికి కృషి చేశానని, ముఖ్యంగా భారత్–పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ ప్రకటిస్తూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కోసం అనేకసార్లు తన అర్హతను చాటుకునే ప్రయత్నం చేశారు.
Rishi Sunak: మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
అయితే, 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) వెనిజులా విపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో (Maria Corina Machado) కు దక్కిందని నోబెల్ కమిటీ (Nobel Committee) వెల్లడించింది.నోబెల్ బహుమతి ప్రకటన అనంతరం కమిటీ ఛైర్మన్ జార్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ మాట్లాడుతూ, తమ నిర్ణయం కేవలం గ్రహీతల ధైర్యసాహసాలు, చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
“ప్రతి ఏటా మాకు వేలాది సిఫార్సు లేఖలు వస్తాయి, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతాయి. కానీ మా నిర్ణయాలు ఆల్ఫ్రెడ్ నోబెల్ (Alfred Nobel) సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి” అని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ట్రంప్ ప్రచార సరళిని ఉద్దేశించినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న కీలకమైన
వెనిజులా (Venezuela) లో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న కీలకమైన, ఐక్యతా శక్తిగా మరియా కొరినాను కమిటీ ప్రశంసించింది.నోబెల్ పురస్కారం కోసం ట్రంప్, వైట్‌హౌస్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. గత నెల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కూడా ట్రంప్ తన శాంతి యత్నాల గురించి గొప్పగా చెప్పుకున్నారు.

భారత్-పాకిస్థాన్ మధ్య మే నెలలో ఉద్రిక్తతలను తానే చల్లార్చానని ఆయన బలంగా వాదించారు. అయితే, పాకిస్థాన్ ప్రత్యక్ష అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ జరిగిందని, ఇందులో ట్రంప్ పాత్ర ఏమీ లేదని భారత్ అప్పట్లోనే తీవ్రంగా ఖండించింది.దీనితో పాటు ఇజ్రాయెల్-ఇరాన్, రువాండా-కాంగో, సెర్బియా-కొసోవో సహా మొత్తం ఏడు యుద్ధాలను తానే పరిష్కరించినట్లు ట్రంప్ చెప్పుకున్నారు.
నోబెల్ బహుమతిపై ట్రంప్‌కు ఉన్న ఆసక్తి
వాస్తవానికి వీటిలో కొన్ని పూర్తిస్థాయి యుద్ధాలు కాకపోగా, మరికొన్నింటిలో ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నోబెల్ బహుమతిపై ట్రంప్‌కు ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) కు గతంలో ఈ పురస్కారం వచ్చినప్పుడు, ఏమీ చేయకుండానే ఆయనకు బహుమతి ఇచ్చారంటూ ట్రంప్ తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: