हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: The Paradise movie: వాయిదా పడ్డ ది ప్యారడైజ్ సినిమా?

Anusha
Latest News: The Paradise movie: వాయిదా పడ్డ ది ప్యారడైజ్ సినిమా?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా రూపొందుతున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ (‘The Paradise’) ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు.

Shahrukh Khan:‘కింగ్’ ఫస్ట్ లుక్: నవంబర్ 2న భారీ అంచనాలతో విడుదల

‘దసరా’ వంటి భారీ విజయాన్ని అందుకున్న నాని ఈసారి మరింత విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మొదటి పోస్టర్‌, గ్లింప్స్‌ రిలీజ్‌ కాగానే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీపై మరోసారి గందరగోళం నెలకొంది.

ఈ చిత్రాన్ని 2026, మార్చి 26న విడుదల చేస్తామని మేకర్స్ పూజా కార్యక్రమాల రోజునే ప్రకటించారు. అయితే సోషల్ మీడియా (Social media) లో వినిపిస్తున్న వార్తల ప్రకారం వచ్చే ఏడాది మార్చి 26న ‘ది ప్యారడైజ్’ రిలీజ్ ఉండకపోవచ్చని అంటున్నారు.

ప్రేక్షకుల ఇంట్రస్ట్ మొత్తం దానిమీదే

ఎందుకంటే మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు కానుకగా చరణ్, సానా బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ చిత్రం (‘Peddhi’ movie) రిలీజ్ కాబోతుంది.గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్ సినిమా రిలీజ్ అంటే ప్రేక్షకుల ఇంట్రస్ట్ మొత్తం దానిమీదే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని కాస్త వెనక్కి జరిపితే బెటరేమో అని మేకర్స్ అనుకుంటున్నారట.

The Paradise movie
The Paradise movie

నాని కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్‌

ఇటీవల రామ్‌చరణ్ వరుస ఫ్లాపుల్లో ఉండటంతో ‘పెద్ది’పై భారీ అంచనాలున్నాయి. మరోవైపు ‘ది ప్యారడైజ్’ కూడా నాని కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకరోజు తేడాలో రిలీజైతే బాక్సాఫీస్ వద్ద క్లాష్ వచ్చి కలెక్షన్లపై ప్రభావం పడొచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ‘ది ప్యారడైజ్’ (The Paradise) ని కొన్ని వారాలు వెనక్కి జరపడం నిర్మాతలకు లాభదాయకమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ ప్యూర్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది.

నాని కెరీర్‌లో ఇప్పటి వరకు లేని కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. రూరల్ సెట్టింగ్, ఎమోషనల్ స్టోరీలైన్, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. షూటింగ్ దాదాపు పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీలో డైలాగ్ కింగ్ మోహన్‌బాబు విలన్‌గా నటిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870