13న విజయవాడలో ఎంపిక ఇంటర్యూలు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి విజయవాడ : రాష్ట్రంలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు ఖతార్ (Qatar) దేశంలో ఉద్యోగ ఉపాధి Jobs అవకాశాలను కూటమి ప్రభుత్వం కల్పించడంలో భాగంగా ప్రత్యేకంగా ఎంపిక ఇంటర్యూ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ప్రభుత్వం, (AP Government) స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (ఓఎంసిఏపీ) ద్వారా ఖతార్ దేశంలోని దోహా ప్రాంతంలో హోమ్ కేర్ నర్స్ (రిజిస్టర్డ్ నర్స్) ఉద్యోగాల కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందన్నారు. అర్హులైన మైనారిటీ వర్గాల యువతీ యువకులు ఈ క్రింద తెలపబడిన రిజిస్ట్రేషన్ (http://naipunyam.ap.gov.in/) రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Beautician Course: ఏపీలో ఫ్రీగా ట్రైనింగ్ బ్యూటీషియన్ కోర్స్

Job opportunities
బి. ఎస్సీ
హోమ్ కేర్ నర్స్ (Nursing) ఉద్యోగానికి దరఖాస్తు చేసే యువతీ యువకుల వయస్సు 21 to 40 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. బి. ఎస్సీ లేదా జి.ఎన్.యమ్ నర్సింగ్ విద్యార్హత ఉండి, అనుభవం కూడా ఉండాలన్నారు. Jobs ఎంపికైన వారికి నెలకు జీతము సుమారు రూ.1.20 లక్షలును ఆదాయపు పన్నును మినహాయించి పొందవచ్చునని, ఉచిత వసతి, రవాణా సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు. ఆన్ లైన్ (online) ద్వారా నమోదును ఈనెల 12వ తేదీ లోపు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వారికి ఇంటర్వూలను 13 వ తేదీ నిర్వహించడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ చేసుకోలేక పోయినవారు అదే రోజు ఉద్నయ 10గంటలకు ఓ ఎం సి ఏ పి కార్యాలయం, గవర్నమెంట్ ఐ.టి.ఐ. కాంపస్, రమేష్ ఆసుపత్రి రోడ్డు, విజయవాడ 520008 నందు జరిగే ఇంటర్యుకు నేరుగా హాజరు కావచ్చునని మంత్రి ఫరూక్ తెలిపారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో మైనారిటీ వర్గాల అభివృద్ధికి అందించబడుతున్న ఈ అవకాశాన్ని బి. ఎస్సీ/ నర్సింగ్ అర్హత కలిగిన మైనారిటీ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని మంత్రి సూచించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279 నెంబర్లకు సంప్రదించడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: