యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) ‘కిష్కింధపురి’ (Kishkindhapuri) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అతనికి జోడీగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించింది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హారర్-థ్రిల్లర్ శైలిలో రూపొందించబడింది. చిత్రం ప్రేక్షకుల మధ్య సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా నిర్మాణం, కధా రచన, విజువల్స్,సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్ని చక్కగా అమర్చబడ్డాయి.
Deepika Padukone: పనివేళలలు అందరికి ఒకే లాగ ఉండాలి
హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మిరాయ్‌కి పోటిగా సెప్టెంబర్ 12న వచ్చి సూపర్ హిట్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీ (OTT) లోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee 5) లో ఈ సినిమా అక్టోబర్ 17 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు దీపావళి కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం టెలివిజన్ జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతున్నట్లు నిర్వహాకులు వెల్లడించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ) ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌస్ టూర్స్ నిర్వహిస్తుంటారు. అలా 11 మందితో కలిసి పాడుబడిన సువర్ణమాయ రేడియో స్టేషన్‌కి వెళ్తారు. అక్కడ వేదవతి అనే ఆత్మ వాయిస్ వినిపిస్తుంది.
లోపలికొచ్చిన వారందరినీ వదిలిపెట్టనని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వేదవతి ఎవరు? ఎందుకు ఆత్మగా మారింది? సువర్ణమాయ నుంచి బయటపడటానికి రాఘవ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది మిగతా కథ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: