ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ K VijayAnand విజయవాడ : ఎస్సి, ఎస్టీ అత్యాచార బాధితులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు. అదే విధంగా ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిచేందుకు ప్రతి నెలా 30వ తేదీన సివిల్ రైట్స్ డేను నిర్వహించాలని, మూడు నెలలకు ఒకసారి తప్పని సరిగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించి ఇందుకు సంబంధించి నమోదైన కేసులు, బాధితులకు అందిస్తున్న పరిహారం తదితర అంశాలను సమీక్షించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, మందుల పంపిణీ, ఆసుపత్రిల్లో పరిశుభ్రత, ఆసుపత్రిల్లో 66X నిర్ధారణ సేవలు, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన, ఎస్సి ఎస్టీ అత్యాచార బాధితులకు పరిహారం చెల్లింపు, పెన్షన్ల రీ అసెస్మెంట్, పాజిటివ్ పబ్లిక్ పెర్సెప్సన్ తదితర అంశాలపై గురువారం ఎపి సచివాలయం (Secretariat) నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
PPP: వైద్య కళాశాలలకు ‘పిపిపి’లో తప్పేముంది?

K VijayAnand
ఎస్సి ఎస్టి అత్యాచార (Rape) బాధితులకు పరిహారం చెల్లించేందుకు 31.54 కోట్ల రూ.లు. విడుదల చేయగా 27.47కోట్ల రూ.లు చెల్లించారని మిగతా నిధులను కూడా సకాలంలో చెల్లించాలని కలక్టర్లను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాల త్రీటైర్ స్ట్రక్చర్ లో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టరేట్, డివిజన్ స్థాయిలో ఎంపిడిఓ, మున్సి పల్ కమిషనర్ కార్యాలయల్లో ప్రత్యేకంగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది కూర్చునేందుకు వీలుగా తగిన స్థలం ఏర్పాటు చేయాలని సిఎస్ కలక్టర్లను అదేశించారు. పియం ఆదర్శ్ గ్రామ యోజనకు సంబంధించి మొత్తం 1174 గ్రామాలు ఎంపిక కాగా ఇప్పటికే 1017 గ్రామాలకు గ్రామాభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయగా మిగతా 157 గ్రామాలకు కూడా త్వరగా సిద్ధం చేయాలని కలక్టర్లను ఆదేశించారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలు సిద్ధమైన వాటిలో ఇప్పటికే 752 ఆమోదం పొందగా వాటిలో 572 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించగా ఇంకా 602 ఆదర్శ్ గ్రామాలుగా ప్రకటించాల్సి ఉందన్నారు.
గ్యాప్ ఫిల్లింగ్ ఫండ్ గా ఆయా ఆదర్శ్ గ్రామాలకు ఇప్పటి వరకు 60.50 కోట్ల రూ.లు విడుదల అయ్యాయని సకాలంలో యుసిలు పంపితే మరిన్ని నిధులు కేంద్రం నుండి మంజూరు చేయించు కోవచ్చని సిఎస్ విజయానంద్ K VijayAnand కలక్టర్లకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 3500 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని అందుకు సంబంధించిన మిషినరీ, టార్పాలిన్లు, గోనె సంచులు, తగిన సిబ్బందికి సంబంధించిన సన్నాహక ఏర్పాట్లన్నీ ఇప్పటి నుండి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సిఎస్ విజయానంద్ కలక్టర్లను ఆదేశించారు. గత సీజన్లో 35.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా ఈసారి కేంద్ర ప్రభుత్వం మరో 15 లక్షల ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన గ్రామాల ప్రణాళికలపై సమీక్షలో సిఎస్ విజయానంద్ మెట్రిక్ టన్నులను అదనంగా కేటాయించిందని అంటే సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉన్నందును ఇప్పటి నుండే తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలక్టర్లకు సూచించారు
ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, (palnadu) ప్రకాశం తదితర జిల్లాల్లో నవంబరు మొదటి వారం నుండి ప్రత్తిపంట కొనుగోలు చేయాల్సి ఉంటుందని అందుకు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా జిల్లాల కలక్టర్లను సిఎస్ ఆదేశించారు. అదే విధంగా ఆక్వా సాగు చెరువుల రిజస్ట్రేషన్ కు సంబంధించి తుర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, నెల్లూరు (Nellore) తదితర జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు పెండింగ్ అధికంగా ఉందని వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు వివిద ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత, మందులు లభ్యత తదితర అంశాలపై సిఎస్ విజయానంద్ కలక్టర్లతో సమీక్షిస్తూ ఎక్కడా అంటు వ్యాధులు ప్రభలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: