టెండర్ల ఖరారుపై స్టేకు నిరాకరించిన హైకోర్టు విజయవాడ (Vijayawada) : వైద్య కళాశాలలను ప్రభుత్వప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తే తప్పేంటని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. నిధుల కొరతతో కోర్టు భవన నిర్మాణాలే నిలిచిపోయాయని గుర్తుచేసిన ధర్మాసనం, నిధుల కొరత వల్లే పిపిపి PPP నిర్ణయం తీసుకొని ఉండొచ్చని వ్యాఖ్యానించింది. టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించి నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్రంలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం (Parvathipuram) వైద్య కళాశాలను పిపిపి విధానంలో అభివృద్ధి చేసేందుకు సెప్టెంబరు 9న ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వసుంధర దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టివైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని వసుంధర తరఫు న్యాయ వాది శ్రీరామ్ వాదించారు.
Andhra Pradesh: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..

What’s wrong with ‘PPP’ for medical colleges?
బిడ్లో విజేతగా నిలిచిన సంస్థ 33 యేళ్ల వరకూ ఆ కళాశాలను నిర్వహిస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలకు 5వేల 800 కోట్ల రూపాయల అంచనాతో పాలనపరమైన అనుమతులు ఇచ్చారని వివరించారు. ఈ దశలో స్పందించిన ధర్మాసనం పాలనపరమైన అనుమతులిస్తే సరిపోతుందా? నిధులు విడుదల చేయాలి కదా అని ప్రశ్నిం చింది. అంత పెద్ద మొత్తంలో సొమ్మును రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసే స్థితిలో ఉండాలి కదా? అని వ్యాఖ్యానించింది. నిధుల కొరత కారణంగా పిపిపి PPP విధానంలో నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండొచ్చని, అది తప్పెలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇటువంటి విషయాల్లో అందరం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవని ఘాటుగా వ్యాఖ్యానించింది. వైద్య కళాశాలల నిర్మాణం పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదేకదా? అని వ్యాఖ్యానించింది. పిపిపి విధానంలో ఆసుపత్రు లను నిర్మించాలనేది ప్రభుత్వవిధానపర నిర్ణయమని, రాజ్యాంగ, చట్టవిరుద్ధ నిర్ణయాల్లోతప్ప ప్రభుత్వ Government విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని ధర్మాసనం తేల్చిచెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని దినితోపాటు వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి, ఎపి వైద్యసేవలు, మోలికాభివృద్ధి సంస్థ ఎండి, ఎపి వైద్య విద్య, పరిశోధన సంస్థ ఎండికి నోటీసులు జారీచేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: