ఆ ఘటన చూసి షాక్ అయ్యాం” – సీజేఐ గవాయ్ స్పష్టీకరణ
సుప్రీంకోర్టులో ఇటీవల జరిగిన విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్(BR Gavai)పై లాయర్ రాకేష్ కిషోర్ షూ విసిరిన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఘటనపై సీజేఐ గవాయ్ స్పందిస్తూ, ఆ రోజు జరిగిన సంఘటన తనకు, తన తోటి న్యాయమూర్తికి షాక్ కలిగించిందని తెలిపారు. “అది మా జీవితంలో ఒక మర్చిపోయిన అధ్యాయం” అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. మొదట రాకేష్ కిషోర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన అసోసియేషన్, అనంతరం ఆయనను శాశ్వతంగా బహిష్కరించింది. ఇకపై ఆయనకు కోర్ట్ ప్రాంగణంలో ప్రవేశం లేదని, ఎంట్రీ కార్డును రద్దు చేశామని అధికారికంగా ప్రకటించింది.
Read also: ప్రతి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం.. తేజస్వి యాదవ్:

లాయర్ రాకేష్ కిషోర్ బహిష్కరణపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం
అక్టోబర్ 6న జరిగిన ఈ ఘటనలో, కోర్టు నెంబర్ 1 హాల్‌లో విచారణ జరుగుతున్న సమయంలో రాకేష్ కిషోర్ కోపంతో షూ విసిరినా అది ధర్మాసనం దాకా వెళ్లలేదు. వెంటనే ఇతర లాయర్లు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టు సిబ్బందికి అప్పగించారు. ఆ సమయంలో సీజేఐ గవాయ్(CJI)తొలిసారిగా స్పందించిన సీజేఐ బీఆర్ గవాయ్ మాత్రం కోర్టు కార్యకలాపాలను ఆపకుండా కొనసాగించారు.
తదుపరి విచారణలో రాకేష్ కిషోర్ సనాతన ధర్మాన్ని అవమానించారని ఆరోపిస్తూ, “ఇది దైవ నిర్ణయం” అని తన చర్యను సమర్థించుకున్నాడు. అయితే, వివరణ తీసుకోకుండానే తాను బహిష్కరించడాన్ని తాను తప్పుబట్టాడు. ఈ ఘటనపై బెంగళూరులో కూడా మరో కేసు నమోదైంది. ఆల్ ఇండియా అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సల దీనిపై ఫిర్యాదు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: