ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధం ఎట్టకేలకు ముగింపు దశకు చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితో ఇజ్రాయెల్-హమాస్ తొలిదశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు విషయాన్ని ఇజ్రాయెల్, హమాస్ కూడా ధ్రువీకరించాయి. గాజా మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకాలు చేయడం గర్వంగా భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు.
Syrup: కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
ఇదొక చారిత్రత్మకమైన అడుగు: ట్రంప్
ఇదొక చారిత్రత్మకమైన అడుగు. ఈ ఒప్పందం యుద్ధ విరామం, బందీలు, ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేస్తుంది. బందీలు అందరూ త్వరలోనే విడుదల అవుతారు. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుంది. అన్ని పార్టీలను సమంగా చూస్తాం. అరబ్, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజు. అలాగే మాతో పాటు కలిసి పనిచేసిన మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్, తుర్కియేకు ధన్యవాదాలు’ అని ట్రంప్ రాసుకొచ్చారు.

ఇజ్రాయెల్‌కు దౌత్యపరమైన విజయం
అటు ఒప్పందాన్ని ధ్రువీకరించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘దేవుని దయతో బందీలను వెనక్కి తీసుకొస్తాం. ఇది ఇజ్రాయెల్‌కు దౌత్యపరమైన విజయం. బందీలందరిని తిరిగి తీసుకురావడం, అలాగే మా లక్ష్యాలను సాధించే వరకు విశ్రాంతి తీసుకోమని మొదటి నుంచి స్పష్టంగా చెబుతున్నాం. నా మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్ప ప్రత్నాలు ద్వారా మేం ఈ కీలకమైన మలుపునకు చేరుకున్నాం. అందుకు ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని నెతన్యాహు పేర్కొన్నారు. హమాస్ కూడా శాంతి ఒప్పందాన్ని ధ్రువీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని తెలిపింది. ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడతాయని విశ్వాసం వ్యక్తం చేసిన హమాస్, గాజాలోకి అంతర్జాతీయ సాయం వచ్చేందుకు అవకాశం ఏర్పడిందని వెల్లడించింది. పాలస్తీనా యుద్ధ ఖైదీల విడుదలకు ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపింది.
హమాస్ దాడిలో 1200 మందికి పైగా మరణాలు
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాకి తీసుకెళ్లింది.ఆ తర్వాత హమాస్‌పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా మూకుమ్మడి దాడులు చేసింది. దాదాపు రెండేళ్లు నుంచి జరుగుతోన్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు 67,183 మంది పాలస్తీనియన్లు మరణించారు. 1,69,841 మంది గాయపడ్డారు. లక్షకుపైగా భవనాలు నేలమట్టమయ్యాయి. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో కొందరు బందీలు విడుదలవగా, ఇంకా 97 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ముందుకొచ్చారు.
హమాస్ ఇజ్రాయెల్‌తో ఎందుకు పోరాడుతోంది?
అక్టోబర్ 7 దాడులకు ఈ “సాధారణీకరణ రైలు”కి అంతరాయం కలిగించడమే కారణమని హమాస్ నాయకులు పేర్కొన్నారు, సాధారణీకరణ ప్రయత్నాలు పాలస్తీనా లక్ష్యాన్ని తగ్గిస్తాయి మరియు ఇజ్రాయెల్‌ను ఈ ప్రాంతంలో “చట్టబద్ధమైన సంస్థ”గా ఏకీకృతం చేస్తాయని ఇస్మాయిల్ హనియే పేర్కొన్నారు.
పాలస్తీనా ఒక దేశమా?
అధికారికంగా పాలస్తీనా రాష్ట్రం అని పిలువబడే పాలస్తీనా పశ్చిమ ఆసియాలోని ఒక దేశం. UN యొక్క 193 సభ్య దేశాలలో 157 దేశాలచే గుర్తించబడిన ఇది తూర్పు జెరూసలేంతో సహా ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ మరియు సమిష్టిగా పాలస్తీనా భూభాగాలుగా పిలువబడే గాజా స్ట్రిప్‌ను కలిగి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: