విశాఖపట్నం ఏసీఏ-వీడీసీఏ స్టేడియం (ACA-VDCA Stadium)లో జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచకప్ (Women’s ODI World Cup 2025) లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, వాతావరణ పరిస్థితులు చిన్న అడ్డంకిగా నిలిచాయి.
Mohammed Shami: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై స్పందించిన షమీ
గేమ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు, మధ్యాహ్నం 1:30కు వర్షం ప్రారంభమయ్యింది. ఫ్యాన్స్ ఆందోళన చెందారు. షెడ్యూల్ ప్రకారం టాస్ సుమారుగా 2:30 గంటలకు జరగాల్సి ఉండగా, చిన్నవాటి జల్లులు కారణంగా ఆ సమయానికి సక్రమంగా టాస్ జరగలేకపోయింది.
అయితే, ముందుగానే అప్రమత్తమైన గ్రౌండ్ సిబ్బంది (Ground crew) వెంటనే మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. సుమారు 30-35 నిమిషాల పాటు వర్షం కురిసింది. వర్షం ఆగిపోయిన తర్వాత, సూపర్ సాపర్లతో మైదానాన్ని సిద్ధం చేసే పనులను సిబ్బంది వేగవంతం చేశారు.

పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న
అనంతరం అంపైర్లు రెండుసార్లు, మొదట 2:45 గంటలకు, ఆ తర్వాత 3:10 గంటలకు మైదానాన్ని పరిశీలించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత, మ్యాచ్‌ను 4 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ (Bowling) ఎంచుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం.
తొలి రెండు మ్యాచుల్లో గెలిచి జోరు మీదున్న భారత జట్టు, తమ విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు, తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా జట్టు, ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో పట్టు సాధించాలని భావిస్తోంది. ఆటగాళ్లు ఇప్పటికే వార్మప్ పూర్తి చేసుకుని కీలక పోరుకు సిద్ధమయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: