కేంద్ర ప్రభుత్వం ఇటీవల నాలుగో విడత రూరల్ బ్యాంకుల విలీనం పై గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) విడుదల చేసింది. ఈ ప్రక్రియలో ఒకే దేశం-ఒకే రీజనల్ రూరల్ బ్యాంక్ (RRB) పద్ధతిని అనుసరించి, రాష్ట్రాల్లోని వివిధ చిన్న గ్రామీణ బ్యాంకులను ఏకీకృతం చేయడం జరిగింది. ఈ విధానం ద్వారా ప్రతి రాష్ట్రంలో ఒకే ప్రధాన గ్రామీణ బ్యాంక్ (Main Grameena Bank) ఉంటుందన్న క్రమాన్ని ఏర్పాటు చేశారు.
Vaikuntha Ekadashi: వైకుంఠ ద్వార దర్శనం రెండా? పదిరోజులా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈ విధానం కింద నాలుగు ప్రధాన గ్రామీణ బ్యాంకులు విలీనం చేయబడ్డాయి. అవి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్,సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఇవన్నీ ఇప్పుడు “ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్”గా విలీనమయ్యాయి. ఈ విలీనం తర్వాత పాత బ్యాంకుల బ్రాంచ్లు, పేర్లు, ఆస్తులు, ఖాతాదారుల వివరాలు ఒక్క చోటా సమీకరించబడ్డాయి.
అక్టోబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి.. అక్టోబర్ 13 ఉదయం 10 గంటల వరకు.. మా పూర్వ బ్యాంకుల సేవలు (ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు) తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.’ అని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్ (Official website) లో పేర్కొంది.ఇక్కడ బ్యాంక్ బ్రాంచ్‌లతో పాటు.. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్, ఏటీఎం సేవలు, బ్యాంక్ మిత్రలు కూడా అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసింది.

ఈ సందర్భంలో కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది
ఇక్కడ అక్టోబర్ 11 రెండో శనివారం, 12 ఆదివారం బ్యాంకులకు హాలిడే అయినప్పటికీ.. ఇక్కడ ఈ రోజుల్లోనూ ఆన్‌లైన్ సేవలు పొందలేరు. ఏటీఎం సేవలు (ATM Services) అందుబాటులో ఉండవు. అంటే మొత్తంగా 5 రోజుల పాటు పూర్తిగా ఈ గ్రామీణ బ్యాంకుల సేవలు (Services of rural banks) పొందలేరని చెప్పొచ్చు.
మరి అక్టోబర్ 13 వ తేదీ తర్వాత ఏం చేయాలో.. ఆయా గ్రామీణ బ్యాంకుల కస్టమర్లకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.ఈ సందర్భంగా విలువైన తమ ఖాతాదారులకు ఈ సందర్భంలో కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది బ్యాంకు. ఈ సమయంలో ఆర్థికపర బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ లావాదేవీలకు (For online transactions) అంతరాయం కలుగుతున్నందున మీ ఆర్థిక లావాదేవీల్ని తగిన విధంగా ప్రణాళిక రూపొందించుకోవాల్సిందిగా ఖాతాదారులకు అభ్యర్థిస్తున్నట్లు తెలిపింది.
అత్యుత్తమ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు
అక్టోబర్ 9 సాయంత్రం 6 గంటలలోపు సేవలు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. విలీనంతో బ్యాంకులు.. కస్టమర్లకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తాయని కేంద్రం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: