డిసెంబరు 31న వైకుంఠ ఏకాదశి Vaikuntha Ekadashi తిరుమల: ప్రపంచప్రఖ్యాతిగాంచిన హిందూ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రానున్న డిసెంబర్ లో వైకుంఠద్వార దర్శనాలు ఎన్ని రోజులు తెరిచి ఉండనున్నారనేది ఇప్పుడు అటు శ్రీవారి భక్తుల్లో ఇటు టిటిడి వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ ఏడాది డిసెంబర్ 31వతేదీ వైకుంఠ ఏకాదశి ఘడియలు మొదలవుతాయి. 2026 నూతన సంవత్సరం జనవరి 1వతేదీ వైకుంఠ ద్వాదశి పర్వదినం మోక్షం లభించే ఘడియలు. అయితే దక్షణిభారతదేశంలోని పలు వైష్ణవాలయాలు అనాదికాలంగా పదిరోజులపాటు పవిత్రమైన వైకుంఠద్వారాలను తెరచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇదే ఆనవాయితీని 20232 సంవత్సరంలో తిరుమల తిరుపతి Tirupati దేవస్థానం అధికారులు నిర్ణయించి పదిరోజుల వైకుంఠద్వారాలను తెరచి ఉంచి భక్తులకు పాలకమండలి దర్శనం చేయిస్తున్నారు. గతంలో 2021 ఆలయంలో తిరుమల ఆనంద నిలయంలోని వైకుంఠద్వారాలను కేవలం అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఘడియల్లో మాత్రం తెరచివుంచి దాదాపు 2లక్షలమంది వరకు భక్తులకు మోక్షమార్గం దర్శనం చేయించేవారు.
California: దీపావళికి హాలిడే ప్రకటించిన కాలిఫోర్నియా

Vaikuntha Ekadashi
అయితే ప్రముఖుల నుండి, ఆగమపండితుల నుండి వచ్చిన విజ్ఞప్తులతో తిరుమల ఆలయంలోనూ పదిరోజులపాటు తెరచివుంచి సామాన్యభక్తులకు ఈ పవిత్రమైన వైకుంఠ ద్వార దర్శనం ప్రశాంతంగా చేయిస్తున్నారు. అయితే ఈ ఏడాది జనవరిలోనూ పది రోజులు వైకుంఠద్వార దర్శ నాలు కల్పించడం, అందుకు భారీగా భక్తులు తరలిరావడం తో 2025 జనవరి 8వతేదీ రాత్రి తిరుపతిలో తొక్కిస లాటు, తోపులాట ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం, యాభైమందికి పైగా భక్తులు క్షతగాత్రులైన విషాద ఘటన చోటుచేసుకుంది. దీంతో అప్పట్లోనే తీవ్రస్థా యిలో భక్తుల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపధ్యంలో అప్పట్లోనే రాష్ట్రప్రభుత్వం పదిరోజుల వైకుంఠ ద్వారదర్శనాలను ఆగమ సలహాదారులు, అర్చకులు పునరాలోచన చేయాలని భక్తులు కోరారు. 2025 జనవరి 10వతేదీ నుండి 19వతేదీ వరకు పదిరోజులు వైకుంఠద్వారాలను తెరచివుంచి భక్తులకు Devotees దర్శనం చేయించారు. ఆ పదిరోజులు దాదాపు 8 లక్షలమంది భక్తులు పవిత్రమైన మోక్ష మార్గంలో ఏడుకొండల స్వామిని దర్శించు కోగలిగారు.
ఇప్పుడు తిరుమల బోర్డు, తిరుమల ఆలయ అధికారులు తీసుకునే నిర్ణయంపై వైకుంఠ ద్వారాలు ఎన్నిరోజులు తెరచివుంచనున్నారనేది సందిగ్ధంలో ఉంది. టిటిడిలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రస్తుత పాలకమండలి, ఉన్నతాధికారులు రానున్న డిసెంబర్ నెలలో 31వతేదీ వైకుంఠ ఏకాదశి ఘడియిలు, 2026 జనవరి 1వతేదీ వైకుంఠ ద్వాదశి ఘడియలు వస్తున్నాయి. రెండురోజులు మాత్రమే వైకుంఠద్వారాలను తెరచి ఉంచుతారా? లేక పదిరోజుల వైకుంఠద్వారాలను తెరచి భక్తులకు దర్శనం చేయిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపైకూడా భక్తుల నుండి అభిప్రాయసేకరణ చేపట్టేందుకు టిటిడి అధికారులు ఆలోచన చేస్తున్నారు. మరీ దేశంలోని పలు వైష్ణవాలయాలలో పదిరోజులు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతున్నపుడు తిరుమల ఆలయంలో తీసుకోనున్న నిర్ణయాలు పై భక్తుల్లో సందిగ్ధత నెలకొంది. మరీ గతంలోలాగే వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతినిస్తారా, లేక పదిరోజులు దర్శనాలకు అనుమతినిస్తారా అనేది త్వరలోనే టిటిడి బోర్డు పెద్దలు, అధికారులు భక్తులకు ఒక స్పష్టత నిచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: