బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shahrukh Khan), ఆయన కు చెందిన సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ హైకోర్టు వీటికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఎన్‌సీబీ (Narcotics Control Bureau) ముంబై జోనల్ డైరెక్టర్‌గా పనిచేసిన సమీర్ వాంఖడే (Sameer Wankhede) దాఖలు చేసిన పరువు నష్టం (defamation) దావా నేపథ్యంలో వెలువడ్డాయి.
Lakshmi Menon: కిడ్నాప్ కేసులో.. నటి లక్ష్మీ మీనన్‌కు కోర్టులో భారీ ఊరట
రెడ్ చిల్లీస్ యజమాని గౌరీ ఖాన్ (Gauri Khan) తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ఈ నోటీసులు రావడం గమనార్హం.నెట్‌ఫ్లిక్స్, ఎక్స్, గూగుల్, మెటా ప్లాట్‌ఫారమ్‌లు, ఆర్పీఎస్‌జీ లైఫ్‌స్టైల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, జాన్ డోలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ప్రతివాదులు ఏడు రోజుల్లోగా సమాధానాలు చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.

విచారణను ఈ నెల 30కి వాయిదా
పిటిషన్ కాపీలను తమకు అందించాలని వాంఖడేకు సూచించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ తన ప్రతిష్ఠను దిగజార్చిందని వాంఖడే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రెడ్ చిల్లీస్, యజమానులు గౌరీ ఖాన్, షారుక్ ఖాన్‌ల నుంచి రూ. 2 కోట్ల నష్టపరిహారాన్ని వాంఖడే డిమాండ్ చేశారు.
ఆ మొత్తాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స నిమిత్తం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ (Tata Memorial Cancer Hospital) కు విరాళంగా ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.వాంఖడే తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేథి (Sandeep Sethi) వాదనలు వినిపించారు. పరువు నష్టం దావా వేసినందుకు అధికారి కుటుంబాన్ని సామాజిక మాధ్యమాల్లో లక్ష్యంగా చేసుకుంటున్నారని కోర్టుకు తెలిపారు.
ట్రోల్ చేస్తున్న పోస్టులు వివిధ మాధ్యమాల్లో ఉన్నాయ
తన భార్యను, సోదరిని ట్రోల్ చేస్తున్న పోస్టులు వివిధ మాధ్యమాల్లో ఉన్నాయని వాంఖడే తన పిటిషన్‌లో వెల్లడించారు.వాదనల సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలమైన కారణాలు లేకుండా ఈ వెబ్ సిరీస్‌ను నిషేధించలేమని తెలిపింది.
పిటిషన్ వేయడానికి ఒక కారణం ఉందని అంగీకరిస్తున్నామని, అయితే నిషేధించడానికి ఒక విధానం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.’ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్ (The Bads of Bollywood’ web series) కు దర్శకత్వం వహించింది షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అని తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: