ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) ముంబైలో జరిగిన ఒక ప్రజా సభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 2008లో జరిగిన ముంబై 26/11 ఉగ్రదాడుల తర్వాత అప్పుడు దేశంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పాకిస్థాన్‌పై ప్రతిస్పందనగా చర్య ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యానిస్తూ, “26/11 దాడులు భారత చరిత్రలో అత్యంత భయంకరమైన ఘటన. మన భద్రతా బలగాలు వెంటనే ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనత చూపింది. ఆ నిర్ణయంవల్ల ఉగ్రవాదులు మరింత ధైర్యం పొందారు” అని పేర్కొన్నారు.
Latest News: Crime: అత్తతో అక్రమ సంబంధం.. వారికీ భార్య అడ్డుగా వస్తుందనే కోపంతో హత్య
మోదీ మాట్లాడుతూ.. మాజీ కేంద్ర మంత్రి మరియు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం చేసిన ప్రకటనలను ప్రస్తావించారు. “చిదంబరం ఇటీవల మాట్లాడుతూ.. ఆ సమయంలో భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నాయని, కానీ విదేశీ ఒత్తిడితో యూపీఏ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని. అంటే కాంగ్రెస్ ఆ సమయంలో దేశ భద్రతకంటే విదేశీ ఒత్తిడిని ఎక్కువగా పరిగణించిందా? ఇది ఎవరి నిర్ణయం? ఎవరు ఆ ఆదేశం ఇచ్చారు? అని దేశం తెలుసుకోవాలనుకుంటోంది” అని మోదీ గట్టిగా ప్రశ్నించారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని “బలహీనతకు ప్రతీక”గా పేర్కొంటూ, NDA ప్రభుత్వం దేశ భద్రత విషయంలో రాజీ పడదని స్పష్టం చేశారు. “బాలాకోట్, ఉరి దాడుల తర్వాత మేము ప్రపంచానికి చూపించాం. భారత్ ఉగ్రవాదంపై రాజీ పడదు. సైన్యం సిద్ధంగా ఉంటే ప్రభుత్వం అడ్డం రాదు, ప్రోత్సహిస్తుంది” అని అన్నారు. మోదీ వ్యాఖ్యలు ఎన్నికల ముందు రాజకీయ ఉష్ణోగ్రత పెంచాయి, ముఖ్యంగా దేశ భద్రతా అంశం మళ్లీ చర్చా కేంద్రంగా మారింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/